టైమ్ వచ్చింది.. అలా చేయక తప్పదు!
అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ గురించి చెప్పుకోవాలి. ముందుగా నటి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Madhu Reddy | 9 Nov 2025 8:00 PM ISTఇండస్ట్రీలో రాణించటం అనేది అంత సులువైన పని కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది తమ టాలెంట్ బయట పెడుతూ సినిమాల్లో అవకాశం అందుకుంటున్నారు. సినిమాల్లో సక్సెస్ అయితేనే ఎక్కువ శాతం నిలబడగలం. సక్సెస్ అవ్వాలి అంటే ముందు ఎంచుకునే కథల విధానంలోనే సరైన క్లారిటీ ఉండాలి. ఏ పాత్ర పడితే.. ఆ పాత్ర చేయకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడవచ్చు.
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే వారసత్వం నుంచి వచ్చిన కొంతమంది మాత్రం విపరీతంగా సక్సెస్ అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ల మీద విపరీతమైన అంచనాలు ఉంటాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో రామ్ పోతినేని మాట్లాడుతూ దేవదాస్ సినిమా నేను చిరంజీవి, గారు, రామ్ చరణ్ కలిసి చూసాము. రామ్ చరణ్ చాలా టెన్షన్ పడుతున్నాడు ఆ సినిమా చూసినప్పుడు. నేను చాలా ఫ్రీగా కూర్చున్నాను అప్పుడు అర్థమైంది అంచనాలు అనేది ఉంటే ఎలా ఉంటుందో నాకు ఆరోజు తెలుసొచ్చింది అంటూ క్లారిటీగా చెప్పాడు.
అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ గురించి చెప్పుకోవాలి. ముందుగా నటి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగులో చేసింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత బోని కపూర్ ను పెళ్లి చేసుకుంది శ్రీదేవి. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు.
జాన్వి కపూర్ హిందీ లో కొన్ని సినిమాలు చేశారు. అవి ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దేవర సినిమా సక్సెస్ అయ్యింది అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ జాన్వి కపూర్ కి రావాల్సినంత పేరు రాలేదు.
ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ సరసన పెద్ది అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత ప్రత్యేకమో తెలుస్తుంది. జాన్వి కపూర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ పెద్ది సినిమా తీసుకొస్తుందా అంటే అది డౌటే, ఎందుకంటే మరోవైపు చరణ్ క్యారెక్టర్రైజేషన్ అదిరిపోయింది.
అయితే ఎవరైనా కూడా తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమేరకు మెగాస్టార్ చిరంజీవి పేరును నిలబెట్టారు రామ్ చరణ్. గతంలో సునీల్ కూడా మాట్లాడుతూ మగధీర టైంలో మిమ్మల్ని దాటేసాడు అంటూ చెప్పారు. అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమా తో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇప్పుడు రామ్ చరణ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటువంటి ప్రత్యేకమైన గుర్తింపు జాన్వి కపూర్ సాధించుకోవాలి అంటే కచ్చితంగా కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఎంచుకొని చేయాలి. అప్పుడే శ్రీదేవి అంతటి స్థాయిలో వెలగకపోయినా ఆ రేంజ్ కు వచ్చే ప్రయత్నం మాత్రం జాన్వి కపూర్ చేయాల్సి ఉంది. కథలు విషయంలోనూ క్యారెక్టర్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకు సాధించవచ్చు.
