జాన్వీ కపూర్ ఇవి డ్యాన్సులా కసరత్తులా?
నేటితరం ఫ్యాషనిస్టాగా ఓ వెలుగు వెలుగుతున్న జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 19 Sept 2025 9:33 AM ISTనేటితరం ఫ్యాషనిస్టాగా ఓ వెలుగు వెలుగుతున్న జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన `పరమ్ సుందరి` విడుదలైన నెలరోజులకే సన్నీ సంస్కారీ కి చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన జాన్వీ, సన్యా మల్హోత్రా నటించారు. ప్రస్తుతం చిత్రబృందం రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. జాన్వీ కూడా ప్రమోషన్స్ లో స్పీడ్ గా పాల్గొంటోంది.
అదే సమయంలో జాన్వీకపూర్ డ్యాన్స్ మూడ్ లో ఉన్న కొన్ని వీడియోలను తన సోషల్ మీడియాల్లో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా జాన్వీ షేర్ చేసిన ఓ డ్యాన్సింగ్ వీడియోలో స్పెషల్ డిజైనర్ లుక్ తో ఆకర్షించింది. ముఖ్యంగా జాన్వీకపూర్ హైఎనర్జీతో అద్భుతమైన డ్యాన్సులతో ఆకట్టుకుంటోంది. జాన్వీ ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో షార్ట్ - స్ట్రాప్ లెస్ టాప్ ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది. వేరొక వీడియోని పరిశీలిస్తే.. ఒక ఎల్లో క్యాబ్ ని ఆనుకుని జాన్వీ మేని విరుపుల స్టెప్పులు ఆకట్టుకున్నాయి. అలాగే స్టూడియోలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కూడా కనిపించింది.
అయితే చాలా వరకూ బ్రేక్ డ్యాన్స్ లు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. శరీరాన్ని కావాల్సిన విధంగా మలుస్తూ జాన్వీ చాలా హార్డ్ గానే డ్యాన్సులను ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ డ్యాన్సుల శైలి పరిశీలించాక.. ఇవి డ్యాన్సులా కసరత్తులా? అంటూ అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిపిందే. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదల కావాల్సి ఉంది.
