'పెద్ది'తో హాట్ టాపిక్.. మరి 'నెక్స్ట్ ' ఏంటి జాన్వీ?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.
By: M Prashanth | 10 Jun 2026 1:08 PM ISTబాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో అచ్చియమ్మ రోల్ ను గ్లామరైజ్ గా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఆ విషయంపై చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు జాన్వీ అప్ కమింగ్ మూవీలపై కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె నెక్స్ట్ ఎలాంటి రోల్స్ సెలెక్ట్ చేసుకోబోతుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించిన పెద్దిలో గ్లామర్ రోల్ లో కనిపించిన జాన్వీ, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్ వైపు అడుగులు వేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె ఓ భారీ స్థాయి హారర్ ప్రాజెక్టు లో నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆ చిత్రానికి తుంబాడ్ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహి అనిల్ బర్వే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ హారర్ సినిమాల చరిత్రలో తుంబాడ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హారర్, ఫాంటసీ, విజువల్ ఎలిమెంట్స్ ను వినూత్నంగా మిక్స్ చేసిన ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. అలాంటి దర్శకుడు మరో కొత్త హారర్ వరల్డ్ సృష్టించేందుకు సిద్ధమవుతుండటంతో ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇది నార్మల్ హారర్ చిత్రం కాదని, భారీ స్థాయిలో రూపొందించే క్రీచర్ హారర్ కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది.
మోడ్రన్ విజువల్ ఎఫెక్ట్స్, టెక్నాలజీతో ఆ సినిమాను నిర్మించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఆ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీ కూడా ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రోల్ కు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచే ప్లాన్స్ వేసుకోవాలని భావిస్తున్నారట.
అవసరమైతే స్పెషల్ వర్క్ షాప్స్ లో పాల్గొని రోల్ ను కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వినికిడి. క్రీచర్ హారర్ వంటి విభిన్న జోనర్ లో నటించడం ఆమెకు కొత్త సవాలుగా మారనుంది. ఇటీవలి కాలంలో జాన్వీ తన పాత్రల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే పెద్ది తర్వాత హారర్ జోనర్ లోకి అడుగుపెట్టే ఆలోచన ఆమె కెరీర్ లో మరో మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్- రాహి అనిల్ బర్వే కాంబినేషన్ పై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హారర్ సినిమాలకు ఇటీవలి కాలంలో ప్రేక్షకుల రెస్పాన్స్ పెరుగుతోంది. కొత్త కాన్సెప్టులు, స్ట్రాంగ్ స్టోరీలతో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధిస్తున్నాయి. అలాంటి సమయంలో జాన్వీ ఇలాంటి ప్రాజెక్టులో భాగమైతే, ఆమె కెరీర్ మలుపు తిరగడం గ్యారెంటీ. మరి పెద్దితో చర్చనీయాంశమైన జాన్వీ... ఇప్పుడు హారర్ వరల్డ్ లో ఎంతలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.
