Begin typing your search above and press return to search.

జిమ్ లో తెగ కష్టపడిపోతున్న జాన్వీ కపూర్.. ఆ ఫోజ్ చూశారా?

ముంబైలోని ఒక జిమ్ సెంటర్లో జాన్వీ కపూర్ ఎక్సర్ సైజ్ చేస్తూ కష్టపడి పోతున్నట్లు ఆ ఫోటోలో మనం చూడవచ్చు.

By:  Madhu Reddy   |   30 Sept 2025 12:29 PM IST
జిమ్ లో తెగ కష్టపడిపోతున్న జాన్వీ కపూర్.. ఆ ఫోజ్ చూశారా?
X

జాన్వీ కపూర్.. దివంగత నటీమణి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎక్కువగా పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా మారి కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత 2018లో వచ్చిన ధడక్ అనే హిందీ సినిమా ద్వారా కెరియర్ ప్రారంభించింది. ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ది కార్లీల్ గర్ల్ వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది. హిందీలో పలు చిత్రాలలో నటిస్తూ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈమె.. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు దక్కించుకుంది.

బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా గత ఏడాది ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ' దేవర' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా చక్కగా నటించింది. ఈ సినిమా తర్వాత ఈమెకు మరో తెలుగు సినిమాలో అవకాశం లభించిన విషయం తెలిసిందే. అలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. ఉప్పెన సినిమాతో స్టార్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతోంది.

ఇదిలా ఉండగా.. మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఈమె.. మరోవైపు తన సినిమా ప్రమోషన్స్ లో కూడా వేగంగా పాల్గొంటూ అభిమానులకు చేరువవుతోంది. అంతేకాదు అటు ఫిట్నెస్ మైంటైన్ చేయడం కోసం జిమ్ లో తెగ కష్టపడి పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ముంబైలోని ఒక జిమ్ సెంటర్లో జాన్వీ కపూర్ ఎక్సర్ సైజ్ చేస్తూ కష్టపడి పోతున్నట్లు ఆ ఫోటోలో మనం చూడవచ్చు. శరీరాన్ని ఫిట్గా, యంగ్గా ఉంచుకోవడానికి జాన్వీ కపూర్ తెగ కష్టపడిపోతోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కి చెందిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

జాన్వీకపూర్ లేటెస్ట్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే హిందీలో పరమ్ సుందరి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. హోమ్ బౌండ్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా రిలీజ్ అయినట్టు ఆడియన్స్ కి తెలియకపోవడంతో మొదటి రోజు కేవలం 30 లక్షల తోనే సరిపెట్టుకుంది.. అయితే ఈ సినిమా ఆస్కార్ ప్రదర్శనకు ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సన్నీ సంస్కారికి తులసి కుమారి అనే సినిమాలో నటిస్తోంది.. అక్టోబర్ రెండవ తేదీన విడుదల కాబోతుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.