టాలీవుడ్‌లో రెండే సినిమాలు చేసినా కోట్లకు కోట్లు కొల్లగొడుతోంది!
పాన్ ఇండియా క్రేజ్‌తో జాన్వీ కపూర్ బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా భారీ ఆదాయం ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో బ్రాండ్‌కు ఏడాది ఒప్పందం కోసం రూ.3–5 కోట్లు, క్యాంపెయిన్ షూట్‌కు రోజుకు రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు తీసుకుంటున్నట్లు వాణిజ్య వర్గాల అంచనా. దక్షిణాది మార్కెట్లలోనూ ఆమె క్రేజ్‌ను బ్రాండ్లు ఉపయోగించుకుంటున్నాయి.
By: Sivaji Kontham | 23 Nov 2026 8:02 AM ISTభారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం `పాన్-ఇండియా స్టార్‌డమ్` అనేది కేవలం బాక్సాఫీస్ వసూళ్లకే పరిమితం కాకుండా..నటీనటుల కమర్షియల్ బ్రాండ్ వాల్యూను కూడా పదింతలు పెంచుతోంది. ఏదో ఒక భాషా పరిశ్రమకు పరిమితమయ్యే కళాకారులతో పోలిస్తే.. ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ ప్రేక్షకులకు చేరువైన తారలకు వాణిజ్య ప్రకటనల రూపంలో భారీ ఆదాయం సమకూరుతోంది. ఈ కోవలోనే బాలీవుడ్ నుంచి దక్షిణాదిలో అడుగుపెట్టి ఇక్కడ అగ్ర హీరోల సరసన నటిస్తూ పాన్-ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్లతో కోట్లు కొల్లగొడుతున్నారు.
ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకుల్లోనూ జాన్వీ కపూర్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా.. కార్పొరేట్ సంస్థలు ఈ భామకు భారీ పారితోషికం చెల్లించేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. అడ్వర్‌టైజింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. జాన్వీ ఒక్కో ప్రముఖ బ్రాండ్‌కు ఏడాది పాటు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సుమారు రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వార్షిక ఒప్పందం కాకుండా కేవలం క్యాంపెయిన్ షూట్‌ల వారీగా ఒప్పందం కుదుర్చుకుంటే.. రోజుకు రూ. 70 లక్షల నుండి రూ. 1 కోటి వరకు అందుకుంటున్నారని వాణిజ్య వర్గాల అంచనా.
తాజాగా ప్రముఖ ఆభరణాల సంస్థ రూపొందించిన బ్రైడల్ జువెలరీ క్యాంపెయిన్‌లో జాన్వీ కపూర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వ్యాపార ఒప్పందాల గోప్యత కారణంగా సదరు గోల్డ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా జాన్వీ అందుకుంటున్న కచ్చితమైన పారితోషికం వివరాలు ఏవీ లీక్ కాలేదు. కానీ కొత్తగా అడుగుపెడుతున్న ఈ సంస్థ ఉత్తరాదితో పాటు దక్షిణాన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని జాన్వీతో ప్రచారం చేయించుకుంటోంది. దానికోసం భారీగా ముడుపులు చెల్లించుకుంటోందట.
కుమార్తె జాన్వీని బోనీకపూర్ చాలా తెలివిగా సరైన సమయంలో టాలీవుడ్ లో ప్రవేశ పెట్టారు. ఇదంతా ఒక స్ట్రాటజికల్ మూవ్ గానే చూడాలి. బాలీవుడ్ లో గ్రాఫ్ తగ్గుతోంది అనగానే, ఇక్కడ స్టార్ హీరోలతో మంతనాలు సాగించాడు. జాన్వీకి నేరుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అగ్రహీరోల సరసన ఆఫర్లు క్యూకట్టాయి. ఇప్పుడు ఇది ఇక్కడ సినిమాల పరంగా సక్సెస్ కంటే, వాణిజ్య ప్రకటనల రంగంలో భారీ ఆదాయానికి బాటలు వేసింది. జాన్వీ తన పాన్ ఇండియా స్టార్ డమ్ ని అడ్డు పెట్టుకుని బ్రాండ్ ప్రమోషన్లకు కోట్లకు కోట్లు కొల్లగొడుతోంది.
