వరుస ఫ్లాప్స్ .. శ్రీదేవి కూతురిని టాలీవుడే కాపాడాలి?
గత కొన్ని రోజులుగా జాన్వీకపూర్ వరుస డిజాస్టర్లు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్లో ఇటీవల 'పరమ్ సుందరి' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.
By: Madhu Reddy | 4 Oct 2025 11:32 AM ISTగత కొన్ని రోజులుగా జాన్వీకపూర్ వరుస డిజాస్టర్లు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్లో ఇటీవల 'పరమ్ సుందరి' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఆ తర్వాత 'హోమ్ బౌండ్' అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్లే ఈ చిత్రం విడుదల అయిన విషయం కూడా చాలామందికి తెలియదు అని చెప్పాలి. అలా ఈ సినిమా మొదటి రోజు కేవలం 30 లక్షలు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఆస్కార్ ప్రదర్శనకు ఎంపికైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా మరొకవైపు కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చిన 'సన్నీ సంస్కారికీ తులసీ కుమారి' సినిమాలో కూడా నటించింది. వరుణ్ ధావన్ హీరోగా నటించారు.. భారీ అంచనాల మధ్య పెద్ద ఎత్తున ప్రమోషన్స్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా కథ రొటీన్ కథ కావడంతో ప్రేక్షకులు దీనిని ఆదరించలేకపోతున్నారు. ఇలా వరుసగా బాలీవుడ్ లో మూడు చిత్రాలు చేస్తే మూడు చిత్రాలు కూడా డిజాస్టర్ కావడం ఆశ్చర్యంగా మారింది. అయితే ప్రస్తుతం అమ్మడి చూపు టాలీవుడ్ పైనే పడింది అని చెప్పడంలో సందేహం లేదు.
విషయంలోకి వెళ్తే.. గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చిత్రం దేవర. ఈ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులను పలకరించింది జాన్వీ కపూర్. పైగా ఇది ఈమెకు తొలి తెలుగు సినిమానే అయినా ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది. ఇప్పుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దీనికి తోడు నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాలో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆశలన్నీ కూడా టాలీవుడ్ పైనే ఉన్నాయని చెప్పాలి.ఎందుకంటే కొంతకాలంగా బాలీవుడ్ పైనే ఆశలు పెంచుకున్న ఈ ముద్దుగుమ్మకు అక్కడ కనీసం ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈమె కెరియర్ ముందుకు సాగాలి అంటే ఈమెను టాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రమే కాపాడాలి అంటూ జాన్వీ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పెద్ది సినిమా కోసం ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన చిన్న చిన్న గ్లింప్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలాగే నాని ది ప్యారడైజ్ మూవీ పై కూడా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలుసు. ఈ రెండు సినిమాలలో ఇప్పుడు జాన్వి కపూర్ అవకాశం అందుకుంది. రెండు కూడా బ్లాక్ బస్టర్ దిశగానే అడుగులు వేస్తున్నాయి. మరి వరుస ప్లాపులతో సతమతమవుతున్న జాన్వీ కపూర్ ను టాలీవుడ్ మాత్రమే కాపాడాలి. మరి జాన్వీ కపూర్ కి టాలీవుడ్ పరిశ్రమ ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి
