రెగ్యులర్ అవుట్ ఫిట్ లో కూడా మరింత అందంగా కనిపిస్తున్న జాన్వీ!
తాజాగా జాన్వీ కపూర్ ధరించిన ఈ ఔట్ ఫిట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
By: Madhu Reddy | 29 Sept 2025 7:30 PM ISTజాన్వీ కపూర్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె దివంగత నటీమణి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తల్లికి తగ్గట్టు అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న జాన్వీ కపూర్.. అటు సోషల్ మీడియాలో కూడా భిన్నవిభిన్నమైన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా అందాలతో అభిమానులను కట్టిపడేసింది.
చూడడానికి రెగ్యులర్ అవుట్ ఫిట్ లా అనిపిస్తున్నా.. ఇందులో ఈమె అందాల ప్రదర్శన చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా చీరను తలపించేలా ఉన్న ఈ అవుట్ ఫిట్ చాలా సరికొత్తగా ఉండటమే కాకుండా అటు ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది. లైట్ పీచ్ కలర్ నెట్టెడ్ శారీ ధరించిన ఈమె.. షోల్డర్ లెస్ టాప్ తో తన మేకోవర్ ను ఫినిష్ చేసింది. ఇక చూసే చూపులతో అభిమానులను సైతం కవ్విస్తోంది అని చెప్పవచ్చు. తాజాగా జాన్వీ కపూర్ ధరించిన ఈ ఔట్ ఫిట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
జాన్వి కపూర్ విషయానికొస్తే.. ఇటీవలే బాలీవుడ్లో 'పరమ్ సుందరి' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇప్పుడు సన్నీ సంస్కారీకి తులసీ కుమారి అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న జాన్వీ కపూర్ అందులో భాగంగానే ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు ఇలా సరికొత్త ట్రెండీ ఔట్ఫిట్ లో దర్శనమిస్తోందని చెప్పవచ్చు.
జాన్వీ కపూర్ తెలుగు చిత్రాల విషయానికొస్తే.. తన తల్లి శ్రీదేవి కోరిక మేరకు తన మొదటి సినిమాను ఎన్టీఆర్ తో తెలుగులో చేసి మంచి విజయం అందుకుంది.. అలా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్ ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది.. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది జాన్వి కపూర్. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతోంది.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు సౌత్ సీనియర్ స్టార్ హీరోయిన్లు కూడా అందుకోని రేంజ్ లో తన మొదటి సినిమాకే ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది జాన్వీ కపూర్. ముఖ్యంగా కీర్తి సురేష్ , రష్మిక మందన్న కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోలేదు అనడంలో అతిశయోక్తి లేదు. అలా తన క్రేజ్ తో ఊహించని డిమాండ్ కలిగి ఉన్న హీరోయిన్గా పేరు దక్కించుకుంది.
