Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రాజ‌స్థానీ క‌న్నెలా జాన్వీ హొయ‌లు

రాజ‌స్థానీ జ‌ర్ధోసి, క‌ళంకార్ ల మిశ్ర‌మంతో రూపొందించిన‌ ఈ ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ డ్రెస్ యువ‌త‌రాన్ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

By:  Sivaji Kontham   |   6 Nov 2025 10:34 AM IST
ఫోటో స్టోరి: రాజ‌స్థానీ క‌న్నెలా జాన్వీ హొయ‌లు
X

బాలీవుడ్ లో ఫ్యాష‌నిస్టాలు ఎంద‌రు ఉన్నా అంద‌రినీ డామినేట్ చేసేస్తోంది జాన్వీ క‌పూర్. జిమ్‌కి వెళ్లినా లేదా యోగా సెష‌న్స్, మార్కెట్ ప్లేస్ .. ఇంకేదైనా ఫిల్మీ ఈవెంట్ కి అటెండ‌యినా, అక్క‌డ క‌ళ్ల‌న్నీ జాన్వీపైనే. షో స్టాప‌ర్ గా, ఫ్యాష‌న్ గేమ్ ఛేంజ‌ర్ గా త‌న‌ను తాను ప్రెజెంట్ చేసుకోవ‌డంలో జాన్వీ క‌పూర్ ఎప్పుడూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూనే ఉంది.





ఈసారి కూడా త‌న‌దైన యూనిక్ లుక్ తో యువ‌త‌రంలో హాట్ టాపిగ్గా మారింది. తాజాగా ఇన్ స్టాలో మ‌రో క్లాసిక్ లుక్ ని షేర్ చేయగా యువ‌త‌రం మ‌తులు పోగొడుతోంది. ఇది రాజ‌స్తానీ క‌ళంకార్ రూపం. కాటుక క‌ళ్లు, వాలు జ‌డ‌.. తీక్ష‌ణ‌మైన చూపుల‌తో.. అంద‌మైన డిజైన‌ర్ బ్లూ లెహంగాలో జాన్వీ ముగ్ధ మ‌నోహ‌ర రూపం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. దీనికి `వెడ్డింగ్ సీజ‌న్` అంటూ సింపుల్ క్యాప్ష‌న్ ని ఇచ్చింది జాన్వీ.





రాజ‌స్థానీ జ‌ర్ధోసి, క‌ళంకార్ ల మిశ్ర‌మంతో రూపొందించిన‌ ఈ ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ డ్రెస్ యువ‌త‌రాన్ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఇక ఈ భారీత‌నం నిండిన‌ డిజైన‌ర్ లెహంగాకు త‌గ్గ‌ట్టే మెడ‌లో ధ‌రించిన హారం కూడా భారీత‌నంతో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. త‌న భుజాల మీదుగా పొడ‌వాటి దుప‌ట్టా మ‌రో ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌. ఈ దుప‌ట్టాను ఎరుపు రంగు క‌ళంకారీ డిజైన్, నీలి రంగు క‌ళంకారీ జ‌ర్ధోసి డిజైన్ తో ఎంతో లావిష్ గా తీర్చిదిద్దారు. జాన్వీ ధ‌రించిన బ్లూ క‌ల‌ర్ దుప‌ట్టాపై ఎరుపు రంగు గులాబీల ప్రింట్ కూడా మ‌రింత అందాన్ని పెంచింది.





జాన్వీని చూడ‌గానే రాజ‌స్థానీ క‌న్నె సోయ‌గం మ‌తులు చెడ‌గొడుతోంది! అంటూ బోయ్స్ కామెంట్ చేస్తున్నారు. ఇది రెగ్యుల‌ర్ లుక్ కాదు.. సంథింగ్ స్పెష‌ల్ లుక్! అంటూ చాలా మంది అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. రొటీన్ కి భిన్నంగా జాన్వీ క‌పూర్ త‌న‌ను తాను ఎలివేట్ చేసుకుంటున్న తీరుకు చాలా మంది ఫిదా అయిపోయామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. మొత్తానికి జాన్వీ కొత్త లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.





ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగా ట్రెండ్స్ ని ఫాలో చేయ‌డంలో జాన్వీ క‌పూర్ ఇత‌ర నాయిక‌ల కంటే చాలా అడ్వాన్స్ డ్ గా ఉంది. బాలీవుడ్ లో జాన్వీతో పాటు, చాలా మంది న‌ట‌వార‌సురాళ్లు తెరంగేట్రం చేసారు. సారా అలీఖాన్, అన‌న్య పాండే, తారా సుతారియా లాంటి సీనియ‌ర్ భామ‌ల‌కు కూడా జాన్వీ ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగా తీవ్ర‌మైన పోటీని ఇస్తోంది. ఇక ఖుషి క‌పూర్ త‌న సోద‌రి జాన్వీని ఫాలో చేసేందుకు ప్రయ‌త్నిస్తున్నాన‌ని చెప్పింది. మొత్తానికి ఫ్యాష‌నిస్టా వైబ్ గురించి ప్ర‌స్థావించాలంటే నేటిత‌రం భామ‌లు జాన్వీని త‌లుచుకోవాల్సిందే.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, జాన్వీక‌పూర్ త‌దుప‌రి `పెద్ది` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేవ‌రలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించిన జాన్వీ వెంట‌నే చ‌ర‌ణ్ స‌ర‌స‌న పెద్దిలో అవ‌కాశం ద‌క్కించుకుంది. జాన్వీకి ఇద్ద‌రు అగ్ర హీరోల స‌ర‌స‌న బ్యాక్ టు బ్యాక్ న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఎన్టీఆర్- కొర‌టాల `దేవ‌ర 2`ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో ఇటీవ‌లే `స‌న్నీ సంస్కారీకి తుల‌సీ కుమారి` చిత్రంలో న‌టించింది. రోమ్ కామ్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా ఆడింది.