అన్యాయం... జాన్వీ కోసం ఆమెను పక్కకి!
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ 'పరమ్ సుందరి' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Ramesh Palla | 4 Sept 2025 11:15 AM ISTజాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ 'పరమ్ సుందరి' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని జాన్వీ కపూర్ చేసిన రెయిన్ రొమాంటిక్ నెంబర్ సూపర్ హిట్ అయింది. జాన్వీ కపూర్ అందాల ఆరబోత చేయడంతో పాటు, ఆమె ఆ పాటలో డాన్సర్‌గానూ మెప్పించింది. ఆ పాట కారణంగా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే సినిమా ఫలితం మాత్రం తారు మారు అయింది. ఆ సినిమా సందడి పూర్తి అయిందో లేదో అప్పుడే 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' సినిమాతో జాన్వీ కపూర్ వచ్చేందుకు రెడీ అయింది. కుమారి తులసి పాత్రలో జాన్వీ కపూర్ ఈ సినిమాలో కనిపించబోతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి మొదటి పాట బిజురియా.. వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పాటలోనూ జాన్వీ అందాల ఆరబోత చర్చనీయాంశం అవుతుందని యూనిట్ సభ్యులు భావించారు.
బిజురియా సాంగ్‌లో జాన్వీ అందాల ఆరబోత
బిజురియా వీడియో సాంగ్‌లో జాన్వీ కపూర్ అందాల ఆరబోత కన్నుల విందు చేసింది అనడంలో సందేహం లేదు. వరుణ్ ధావన్ తో కలిసి ఆమె చేసిన డాన్స్ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటోంది. అందం చూపించడంలో పెట్టిన శ్రద్ద డాన్స్ చేయడంలో చూపించలేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఈ పాటలో జాన్వీ కపూర్ కాకుండా సన్యా మల్హోత్ర కూడా ఉంది. అయితే ఈ పాటలో కేవలం జాన్వీ కపూర్ డాన్స్ మాత్రమే చూపించడం, సన్యా మల్హోత్రను అలా పక్కన ఆడియన్ మాదిరిగా నిలబెట్టడం ఏమాత్రం సరి కాదు అంటూ చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జాన్వీ కపూర్ డాన్స్‌తో పోల్చితే సన్యా మల్హోత్ర అద్భుతమైన డాన్సర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా సన్యాను పక్కన పెట్టడంకు కారణం కేవలం నెపొటిజం అంటూ కొందరు కొత్త యాంగిల్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్‌ల షో..
సోషల్ మీడియాలో ఈ పాట విడుదలైన తర్వాత చాలా మంది సన్యా మల్హోత్రాతో ఎందుకు డాన్స్ చేయించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. జాన్వీ కపూర్ డాన్స్ ఫేడ్ ఔట్ అవుతుందని, ఆమెకు ప్రాధాన్యత ఎక్కడ తగ్గుతుందో అనే ఉద్దేశంతోనే కొందరు ఫిల్మ్ మేకర్స్ కావాలని సన్యా మల్హోత్రను పక్కన పెట్టినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద అన్యాయం. సినిమాకు న్యాయం చేయడం కోసం మంచి డాన్సర్ అయిన సన్యా మల్హోత్రను ఖచ్చితంగా పాటలో డాన్స్ చేయించాల్సి ఉంది. అలా డాన్స్ చేయించక పోవడం అనేది చాలా పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులు, అంతే కాకుండా ఆమె డాన్స్‌ను అభిమానించే వారు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు డాన్స్ లో జాన్వీని మించిన ప్రతిభ సన్యా మల్హోత్ర సొంతం అనడంలో సందేహం లేదు.
సన్యా మల్హోత్ర డాన్స్ చూడలేక పోయాం..
సన్నీ సంస్కారి కి తులసి కుమారి సినిమాలో జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ కావచ్చు. కానీ పాటలో ఆమెను సైతం డాన్స్ చేయిస్తే ప్రేక్షకులకు ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన వారు అవుతారు కదా అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ఈ విషయం గురించి స్పందించలేదు. కానీ సినిమాలో సన్యా మల్హోత్రా పోషించిన పాత్ర అనుసారం ఆ పాటలో ఆమె డాన్స్ ఉండకూడదు. అందుకే ఆమెను పాటకు డాన్స్ చేయించలేదని అంటున్నారు. అయినా కూడా జాన్వీ కపూర్ కోసం ఆమెను పక్కకు పెట్టారని, ప్రతిభను తొక్కడం అంటే ఇదే అని, ఆమె యొక్క ప్రతిభకు తగ్గట్లుగా అవకాశం దక్కాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
