Begin typing your search above and press return to search.

మందు బాబుల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన జాన్వీ క‌పూర్!

మద్యపాన వ్యసనం మానసిక ఆరోగ్యంపై బాలీవుడ్ న‌టి జాన్వీక‌పూర్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

By:  Srikanth Kontham   |   4 April 2026 9:36 AM IST
మందు బాబుల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన జాన్వీ క‌పూర్!
X

మద్యపాన వ్యసనం మానసిక ఆరోగ్యంపై బాలీవుడ్ న‌టి జాన్వీక‌పూర్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. మద్యపానానికి బానిసవ్వడం అనేది ఒక వ్యక్తి నైతిక పతనం కాదని దానిని ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యసనపరులను సమాజం చూసే కోణంలో మార్పు రావాలని జాన్వీ కోరింది. `ఎవరైనా మద్యానికి బానిసైనంత మాత్రాన వారి వ్యక్తిత్వాన్ని లేదా క్యారెక్టర్‌ను తక్కువ చేసి అంచనా వేయలేమంది. `వ్యసనం అనేది ఒక వ్యక్తి ఎంచుకునే విలాసం కాదు. అది ఒక మానసిక శారీరక రుగ్మతగా పూర్కొంది.

సమాజం వారిని నేరస్తుల్లా కాకుండా? చికిత్స అవసరమైన రోగుల్లా గుర్తించాలని అమ్మ‌డు హితవు పలికింది. చాలా మంది మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల తెలియకుండానే వ్యసనాల వైపు మళ్లుతుంటారంది. అటువంటి సమయంలో వారిని విమర్శించడం లేదా దూరం పెట్టడం వల్ల వారు మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని భావించడం తప్పు అని దీని వెనుక లోతైన వైద్య కారణాలు కూడా ఉంటాయని అమ్మ‌డు అభిప్రాయ‌ప‌డింది.

వ్యసనం నుండి బయటపడాలనుకునే వారికి కుటుంబ సభ్యులు , సమాజం నుండి సానుభూతి, మద్దతు లభించినప్పుడే త్వరగా కోలుకోగలరంది. కేవలం మందలించడం వల్ల ప్రయోజనం ఉండదని దానికి బదులుగా శాస్త్రీయమైన చికిత్స , కౌన్సెలింగ్ అందించడం ముఖ్య‌మ‌ని తెలిపింది. ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు వారిని నడిపించడంలో సమాజ బాధ్యత ఎంతో ఉందని అభిప్రాయ‌ప‌డింది. జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్య‌లు మద్యపాన వ్యసనంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించే ఓ ప్రయత్నంలా కనిపిస్తున్నాయి.

ఒక సెలబ్రిటీగా ఇలాంటి సున్నితమైన , సామాజిక అంశంపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడటం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటుంది. వ్య‌స‌నాల‌తో ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలవాలనే ఆమె సందేశం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇక జాన్వీ సినిమాల‌ విష‌యానికి వ‌స్తే? అమ్మ‌డు తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా `పెద్ది` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 30న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. `దేవ‌ర 2` లో కూడా ఈ భామ‌నే హీరోయిన్ గా కొన‌సాగ‌నుంది. `దేవ‌ర` మొద‌టి భాగానికి కొన‌సాగింపుగా చిత్రాన్ని ప‌ట్టా లెక్కించనున్నారు. ఇందులో అమ్మ‌డు తంగ పాత్ర‌లో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. అలాగే బాలీవుడ్ సినిమాల‌తోనూ జాన్వీ క‌పూర్ బిజీగా ఉంది. మ‌రోవైపు కోలీవుడ్ ప్ర‌య‌త్నాలు కూడా చేస్తోంది.