హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న జాన్వీ కపూర్!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా సాంప్రదాయ దుస్తులతో మెరిసింది. జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
By: Madhu Reddy | 25 Sept 2025 12:03 PM ISTబాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా సాంప్రదాయ దుస్తులతో మెరిసింది. జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలు పంచుకోవడంతోపాటు అభిమానులకు నవరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. జాన్వీ కపూర్ నుండి రాబోయే తాజా మూవీ 'సన్నీ సంస్కారీకి తులసీ కుమారి'.. ఈ సినిమా చిత్ర యూనిట్ తో కలిసి జాన్వీ కపూర్ దిగిన కొన్ని అద్భుతమైన ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో జాన్వీ కపూర్ తో పాటు చిత్రయూనిట్ అందరూ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని కనిపించారు. అలాగే ఈ ఫోటోకి క్యాప్షన్ గా "నవరాత్రి శుభాకాంక్షలు" అంటూ రాసుకోచ్చింది.
సాంప్రదాయమైన దుస్తులు ధరించిన జాన్వీ కపూర్ ఆ లుక్ లో చాలా అద్భుతంగా కనిపించింది.. సాంప్రదాయ దుస్తుల్లో కూడా హార్ట్ ఫోజులు ఇచ్చింది అంటూ కొంతమంది ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన రాబోయే మూవీ సన్నీ సంస్కారీకి తులసి కుమారి అనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన నవరాత్రి వేడుకల్లో పాల్గొని సినిమాకి ప్రత్యేక ప్రమోషన్స్ చేసుకుంది. అంతేకాకుండా గుజరాత్ లోని ప్రజలతో కలిసి గర్భా స్టెప్పులు వేసి అక్కడున్న అభిమానులను ఆశ్చర్యపరిచింది. అలా ఓ రకంగా సంస్కృతిని పాటించడంతోపాటు తన సినిమాకి ప్రమోషన్ కూడా చేసుకుంది జాన్వీ కపూర్.. ప్రస్తుతం జాన్వీ కపూర్ కి సంబంధించిన ఈ ఫోటోలు,వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు జాన్వీ కపూర్ లుక్ కి ఫిదా అవుతున్నారు.
సన్నీ సంస్కరీ కి తులసి కుమారి సినిమా విషయానికి వస్తే.. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.ఈ మూవీ రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.. వీరి కాంబోలో రాబోయే సినిమాలో ఇద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, మనీష్ పాల్, రోహిత్ సరాఫ్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు.
అలాగే జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జైత్వా కలిసి నటించిన హోమ్ బౌండ్ మూవీ రీసెంట్ గానే ఆస్కార్ కి ఎంపికైంది. 2025లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంతో ఆస్కార్ కి ఎంపిక చేశారు..
మరోవైపు రీసెంట్ గానే జాన్వీ కపూర్ పరమ్ సుందరి మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో జాన్వీ కపూర్ ప్రస్తుతం సన్నీ సంస్కారి కి తులసి కుమారి అనే సినిమాపైనే దృష్టి పెట్టింది. మరి ఈ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి.
