Begin typing your search above and press return to search.

'పెద్ది' జాన్వీ లుక్.. పక్కా మాస్ క్యారెక్టర్

ఇక నేడు రిలీజ్ చేసిన పోస్టర్ లో, ముఖ్యంగా ఓపెన్ టాప్ జీపుపై నిలబడి, జనం మధ్యలో అభివాదం చేస్తున్న లుక్ అదిరిపోయింది.

By:  M Prashanth   |   1 Nov 2025 3:58 PM IST
పెద్ది జాన్వీ లుక్.. పక్కా మాస్ క్యారెక్టర్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయి. ఇప్పటికే చరణ్ మేకోవర్, సినిమా బ్యాక్‌డ్రాప్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు, ఆ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తూ, మేకర్స్ ఈ సినిమా నుంచి హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఒక్క పోస్టర్‌తో జాన్వీ తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తోంది.





జాన్వీ కపూర్ అనగానే మనకు గుర్తొచ్చేది బాలీవుడ్ గ్లామర్, ఫ్యాషన్ ఐకాన్. కానీ 'పెద్ది' కోసం ఆమె చేసిన మేకోవర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇది సింపుల్ డీ గ్లామ్ రోల్ కాదు, పక్కా మాస్ క్యారెక్టర్. శ్రీదేవి కూతురిగా 'అతిలోక సుందరి' ఇమేజ్ ఉన్న జాన్వీ, ఇప్పుడు 'అచ్చియమ్మ'గా పూర్తి మాస్ అవతార్‌లో కనిపించబోతోంది. ఇది ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్.





ఇక నేడు రిలీజ్ చేసిన పోస్టర్ లో, ముఖ్యంగా ఓపెన్ టాప్ జీపుపై నిలబడి, జనం మధ్యలో అభివాదం చేస్తున్న లుక్ అదిరిపోయింది. ఆ కట్టుబొట్టు, ఆ సన్ గ్లాసెస్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే, ఇది కేవలం హీరో పక్కన పాటలు పాడుకునే హీరోయిన్ పాత్ర కాదని, కథలో చాలా పవర్ ఉన్న రోల్ అని అర్థమవుతోంది. అందుకే మేకర్స్ ఆమె క్యారెక్టర్‌ను "ఫియర్స్ అండ్ ఫియర్‌లెస్" అని పిలుస్తున్నారు.

డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన గురువు సుకుమార్ స్టైల్‌లోనే, హీరోయిన్ పాత్రలను చాలా బలంగా డిజైన్ చేసినట్లున్నాడు. 'ఉప్పెన'లో 'బేబమ్మ' పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో, ఇప్పుడు 'అచ్చియమ్మ' పాత్రను కూడా అంతే పవర్‌ఫుల్‌గా మలిచాడని ఈ లుక్ ప్రూవ్ చేస్తోంది. ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, ఒక పల్లెటూరి సోషల్ డ్రామాలా కనిపిస్తోంది.

బాలీవుడ్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్, సౌత్ సినిమాలో, అది కూడా పాన్ ఇండియా లెవల్‌లో ఇంత పూర్తిస్థాయి మాస్ రోల్ చేయడం పెద్ద ఛాలెంజ్. ఒకవేళ 'అచ్చియమ్మ' పాత్ర 'రంగస్థలం'లోని 'రామలక్ష్మి'లా పేలితే, జాన్వీ రేంజ్ ఇండియా వైడ్‌గా మారిపోతుంది. ఆమె కేవలం గ్లామర్ డాల్ కాదని, పెర్ఫార్మెన్స్‌తోనూ మెప్పించగలదని ప్రూవ్ చేసుకున్నట్లే. ఈ భారీ బడ్జెట్ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతంఆ అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. 2026 మార్చి 27న రానున్న ఈ సినిమాలో, చరణ్ మేకోవర్‌తో పాటు, 'అచ్చియమ్మ'గా జాన్వీ మాస్ పెర్ఫార్మెన్స్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనున్నట్లు అర్ధమవుతుంది.