Begin typing your search above and press return to search.

అచ్చియ‌మ్మ ఆయ‌న అమ్మమ్మ పేరా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా బుచ్చిబాబు సానా `పెద్ది` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   3 Nov 2025 2:00 AM IST
అచ్చియ‌మ్మ ఆయ‌న అమ్మమ్మ పేరా?
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా బుచ్చిబాబు సానా `పెద్ది` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చ‌ర‌ణ్ `పెద్ది` పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్ల‌తో చ‌ర‌ణ్ పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది ఓ ఐడియా వ‌చ్చింది. పూర్తి మాస్ కోణంలోసాగే రోల్ గా హైలైట్ అవుతుంది.

అలాగే జాన్వీ క‌పూర్ `అచ్చియ‌మ్మ` అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది. ఇందులో మోడ్రన్ అచ్చియ‌మ్మ‌గా క‌నిపిస్తుంది. `పెద్ది` ప్రేమికురాలి రోల్ అది. ఆ రెండు పాత్ర‌ల మ‌ధ్య రొమాన్స్ కూడా ఘాటుగానే ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది.

అచ్చియ‌మ్మ వెనుక కార‌ణం:

అయితే జాన్వీక‌పూర్ పాత్ర‌కు అచ్చియ‌మ్మ అనే పేరు పెట్ట‌డంతో విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌త్యేకంగా అచ్చియ‌మ్మ అన్న‌ది హైలైట్ గా మారింది. సాధార‌ణంగా ఇలాంటి పేర్లు పాత సినిమాల్లో క‌నిపిస్తుంటాయి. ఆ త‌ర్వాత కాలంలో కూడా ఏ హీరోయిన్ కు ఇలాంటి పేరు పెట్ట‌లేదు. ఎంత పాత సినిమాలు చేసినా పేర్ల వ‌ర‌కూ మోడ్ర‌న్ గా ఉండేలా చూసుకునే వారు ద‌ర్శ‌కులు. కానీ `పెద్ది` లో హీరోయిన్ పాత్ర పేరు మాత్రం ఇప్పుడు హైలైట్ గా మారింది. ప్ర‌త్యేకంగా అచ్చియ‌మ్మ అని పెట్ట‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి? అని ఆరాలు మొద‌ల‌య్యాయి.

స్వ‌చ్ఛ‌మైన తెలుగు పేరు:

ఈ నేప‌త్యంలో హీరోయిన్ పాత్ర అలాంటి పేరు డిమాండ్ చేయ‌డంతో పాటు..బుచ్చిబాబు అమ్మ‌మ్మ గారి పేరు కూడా అచ్చియ‌మ్మ అని ఫిలిం స‌ర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. ఈనేప‌థ్యంలో జాన్వీ క‌పూర్ పాత్ర‌ కు గుర్తుగా అచ్చియ‌మ్మ అని పేరు పెట్టార‌ని చర్చ జ‌రుగుతుంది. మ‌రి ఇందులో నిజ‌మెంత‌? అన్న‌ది తేలాలి. ఏది ఏమైనా ఈ పేరు పెట్ట‌డం అన్న‌ది పెద్ద సాహ‌స‌మే. `రంగ‌స్థ‌లం`లో హీరోయిన్ సమంత ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో క‌ని పిస్తుంది. ఆ పాత్ర‌కు సుకుమార్ రామ‌ల‌క్ష్మి అని పేరు పెట్టారు. ప‌ల్లెటూరి అమ్మాయికి ఎంతో స్వ‌చ్ఛ‌మైన‌ పేరు.

సుకుమార్ కంటే మూలాల్లోకి:

అందులో తెలుగుద‌నం ఉట్టి ప‌డుతుంది. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు అంత‌కు మించి తెలుగు ద‌నం హైలైట్ అయ్యేలా పాత్ర‌ల పేరు ప‌రంగా ఇంకా మూలాల్లోకి వెళ్లిన‌ట్లు క‌నిపిస్తోంది. `అచ్చియమ్మ` అన్న‌ది టైటిల్ కార్స్డ‌లో ప‌డుతుంది. సినిమాలో అదే పేరును అచ్చెమ్మ‌ అని కూడా పిలిచే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుతం `పెద్ది` ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అన్ని ప‌నులు పూర్తి చేసి మార్చిలో లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.