పెద్ద స్టార్ అయినా సెట్ లో మాత్రం స్టూడెంట్ లాగానే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటించి టాలీవుడ్ కు పరిచయమైన జాన్వీ ఆ సినిమాతో మంచి వెల్‌కమ్ ను అందుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Oct 2025 5:00 PM ISTబాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఓ వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిన సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటించి టాలీవుడ్ కు పరిచయమైన జాన్వీ ఆ సినిమాతో మంచి వెల్‌కమ్ ను అందుకున్నారు. దేవర రిలీజ్ అవకముందే జాన్వీ మరో తెలుగు సినిమాకు కూడా సైన్ చేశారు.
పెద్దిలో మొదటిసారి రామ్ చరణ్ సరసన
అదే పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో వీరిద్దరి జంట ఆన్‌స్క్రీన్ ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
పెద్ది మూవీపై జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇదిలా ఉంటే జాన్వీ నటించిన బాలీవుడ్ మూవీ సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి అనే సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన జాన్వీ తాను తెలుగులో చేస్తున్న రెండో సినిమా పెద్ది గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో జాన్వీ, రామ్ చరణ్ గురించి, బుచ్చిబాబు గురించి మాట్లాడారు.
చరణ్ వర్కింగ్ స్టైల్ కు జాన్వీ ఫిదా
పెద్ది మూవీలో తన రోల్ బ్లాస్ట్ అయ్యేలా ఉంటుందని, తన పాత్ర అందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తుందని చెప్పారు జాన్వీ. బుచ్చిబాబు గతంలో తీసిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ గా నిలిచిందని, ఆయన రూటెడ్ డైరెక్టర్ అని, బుచ్చిబాబు కు ఒక విజన్ ఉందని తెలిపిన జాన్వీ, రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయ్యానని చెప్పారు. రామ్ సర్ అంటే ఆలా ఇష్టమని, ఆయన ఓ జెంటిల్‌మెన్ అని, చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని, ఆయనెంతో సీనియర్, స్టార్ అయినప్పటికీ సెట్ కు వచ్చేటప్పుడు ఓ స్టూడెంట్ లాగానే వస్తారని, ఆ సెట్ లో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని జాన్వీ చెప్పుకొచ్చారు.
