2016 vs 2026 ట్రెండ్‌లో చేరిన 'పెద్ది' బ్యూటీ
ఇటీవల 2016 vs 2026 ఫోటోల ట్రెండ్ పెద్ద చర్చగా మారింది. మృణాల్ ఠాకూర్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఈ ఫోటోల ట్రెండ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
By: Sivaji Kontham | 18 Jan 2026 11:00 PM ISTఇటీవల 2016 vs 2026 ఫోటోల ట్రెండ్ పెద్ద చర్చగా మారింది. మృణాల్ ఠాకూర్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఈ ఫోటోల ట్రెండ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జనవరి 2026లో మృణాల్ తన ఇన్‌స్టాలో కొన్ని పాత వీడియోలు, కొత్త సెల్ఫీలను షేర్ చేస్తూ ఈ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. 2016 నాటి తన పాత వీడియోలను వెతికితే కేవలం మూడు మాత్రమే దొరికాయని, అవి చూడటానికి ఇబ్బందిగా..నవ్వు తెప్పించే(క్రింజ్ గా)లా ఉన్నాయని సరదాగా చెప్పుకొచ్చారు. తన గ్యాలరీలో ఉన్న కొన్ని లేటెస్ట్ సెల్ఫీలను కూడా షేర్ చేశారు.
నేను ఈ ట్రెండ్‌ను ఆలస్యంగా ఫాలో అవుతున్నానా? అని మృణాల్ తన అభిమానులను అడిగారు. ధనుష్‌తో పెళ్లి వార్తలు ఒకవైపు ఊదరగొడుతున్న సమయంలో మృణాల్ అవేవీ పట్టించుకోకుండా తన పాత జ్ఞాపకాలను పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఇది స్పష్ఠం చేసింది.
కరీనా కపూర్ తన 2016 నాటి బేబి బంప్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ట్రెండ్ అప్పట్లో బాగా వైరల్ అయింది. మృణాల్ కూడా ఆ ట్రెండ్‌లో భాగమయ్యారు. ఆ తర్వాత జాన్వీకపూర్ సోదరి ఖుషీ కపూర్ క్రింజ్ ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో డిబేట్ మొదలైంది. 16 జనవరి 2026న ఖుషీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో `2026 ఒక కొత్త 2016` అనే వైరల్ ట్రెండ్‌లో భాగంగా ఈ పోస్ట్ పెట్టారు. ఖుషీ కపూర్ 2016 నాటి తన పాత ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ .. 2016 నుంచి కేవలం మూడు క్రింజ్ వీడియోలు, 2026లో అలాంటివే కొన్ని సెల్ఫీలు షేర్ చేస్తున్నానని రాసారు. ఖుషీ తన టీనేజ్ రోజుల్లో (2016లో) సరదాగా తీసుకున్న మూడు వీడియోలను షేర్ చేశారు. అవి ఇప్పుడు చూస్తే తనకు `క్రింజ్`గా అనిపిస్తున్నాయని ఖుషీ చమత్కరించారు. ప్రస్తుతం సంవత్సరం 2026లోను తను తీసుకున్న కొన్ని అందమైన సెల్ఫీలను కూడా జత చేస్తూ, ఈ ట్రెండ్‌లో పాల్గొనడానికి నేను ఆలస్యం చేశానా? అని అడిగారు. 2016లో చాలా కూల్‌గా ఉండేదాన్ని అని కూడా ఖుషీ పేర్కొంది.
దీనికి జాన్వీ కపూర్ `షాక్డ్` అంటూ రియాక్ట్ అయ్యారు. ఖుషీ పోస్ట్ చూసిన వెంటనే తన అక్క జాన్వీ కపూర్ చాలా సరదాగా స్పందించారు. అసలు అందరూ ఎందుకు ఈ 2016 ట్రెండ్ ఫాలో అవుతున్నారో అర్థం కాక, జాన్వీ ఇలా కామెంట్ చేశారు. అసలు అందరూ ఇది ఎందుకు చేస్తున్నారు? అని రాసారు. జాన్వీ చేసిన కామెంట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
అసలు ఈ 2016 ట్రెండ్ ఏంటి? అంటే వివరాల్లోకి వెళ్లాలి. జనవరి 2026 ప్రారంభంలో సోషల్ మీడియాలో `2026 ఈజ్ ది న్యూ 2016`` అనే ట్రెండ్ మొదలైంది. పదేళ్ల క్రితం (2016లో) తాము ఎలా ఉన్నామో చూపిస్తూ, అప్పటి పాత స్నాప్‌చాట్ ఫిల్టర్లు, ఫ్యాషన్ సెన్స్, ఇతర జ్ఞాపకాలను సెలబ్రిటీలు షేర్ చేస్తున్నారు. ఖుషీ కపూర్‌తో పాటు అనన్య పాండే, సోనమ్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్ కూడా ఈ ట్రెండ్‌లో పాల్గొని తమ పాత ఫోటోలను షేర్ చేశారు.
ఖుషీ కపూర్ తర్వాత ఇప్పుడు తన సోదరి జాన్వీ కపూర్ కూడా ఈ క్రింజ్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ``2016 నుండి కేవలం 3 చాలా భయంకరమైన వీడియోలు మాత్రమే దొరికాయి, కాబట్టి అవైనా మిగిలి ఉన్నాయి`` అని రాసారు. కానీ 2026 సెల్ఫీలు మిస్ అయ్యాయని ఆవేదన చెందుతూ, ఈ ట్రెండ్‌లో చాలా ఆలస్యంగా జాయినయ్యానా?`` అని ప్రశ్నించారు. ప్రస్తుతం జాన్వీ షేర్ చేసిన 2016 ఫోటోలు, వీడియోలు వైరల్ గా షేర్ అవుతున్నాయి. వీటిలో ఒక వీడియో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అప్పట్లో జాన్వీ చాలా శ్రద్ధగా క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నది, అలాగే టీవీలో కొరియోగ్రఫీ చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్న మరో వీడియో కూడా వైరల్ గా మారుతున్నాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ నటించిన `పెద్ది` మార్చి చివరిలో విడుదలకు రానున్న సందర్భంగా అభిమానులు చాలా ఉత్కంఠగా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తనను తాను లైమ్ లైట్ లో ఉంచుకుంటూ జాన్వీ చేస్తున్న ఈ ప్రచారం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
