దళపతి విజయ్ సినిమా ప్లాన్ మారిందా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి సినిమా `జన నాయగన్`. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి`కి ఇది రీమేక్.
By: Tupaki Entertainment Desk | 16 Jan 2026 11:07 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి సినిమా `జన నాయగన్`. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి`కి ఇది రీమేక్. కానీ ఆ విషయాన్ని డైరెక్టర్‌గానీ, మేకర్స్ గానీ ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. బాలయ్య క్యారెక్టర్‌లో విజయ్ ఎలా నటించాడో అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తమిళ ప్రేక్షకులకు ఇది ఫ్రెష్ స్టోరీ, విజయ్ చివరి సినిమా వంటి కారణాలతో వాళ్లు కూడా `జన నాయగన్` కోసం వెయిటింగ్.
అయితే సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ వివాదం తలెత్తడంతో రిలీజ్‌కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మద్రాస్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సీబీఎఫ్‌సీ వర్గాలు సవాల్ చేయడంతో సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేయడం తెలిసిందే. దీంతో మేకర్స్ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. సర్టిఫికెట్ జారీపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కోరుతూ `జన నాయగన్` మేకర్స్ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంని ఆశ్రయించింది.
అయితే కేవీఎన్ ప్రొడక్షన్స్ పిటీషన్‌ని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించి మేకర్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టునే ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సూచించింది. అయితే సర్టిఫికెట్ జారీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సినిమాకు అన్యాయం జరిగే అవకాశం ఉందని మేకర్స్ తరుపు న్యాయవాది సుప్రీంకు తెలపగా..దీనిపై ఖచ్చితంగా జనవరి 20న తీర్పు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సుప్రీం కోర్టు సూచించింది.
దీంతో `జన నాయగన్` రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేస్తుందా? లేక మళ్లీ మెలిక పడుతుందా? అనే చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో జనవరి 20న ఖచ్చిమైన తీర్పు వస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రిలీజ్‌కు సంబంధించి మేకర్స్ ప్లాన్ మార్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ జనవరి 20న తీర్పు వెలువరిస్తే `జన నాయగన్`ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని, ఇందుకు జనవరి 26ని ఎంచుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జనవరి 26న రిపబ్లిక్ డే. ఈ రోజునే విజయ్ సినిమా రిలీజ్ చేస్తే రీచ్ భారీ స్థాయిలో ఉంటుందని, సినిమాలకు గుడ్‌బై చెబుతున్న విజయ్‌కి ఇది మంచి ఫేర్‌వెల్ డే అవుతుందని భావిస్తున్నారట. అన్నీ కరెక్ట్‌గా కుదిరితే జనవరి 26న `జన నాయగన్` థియేటర్లలో సందడి చేయడం లాంఛనమే అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
