విజయ్ ఆఖరి సినిమా ఫంక్షన్ కోసం బారి ఏర్పాట్లు
అయితే ఇప్పుడు కోలీవుడ్ లో ఓ ఆడియో లాంచ్ ను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 7 Aug 2025 3:31 PM ISTకోలీవుడ్ లో ఆడియో లాంచ్ ఈవెంట్ లకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఇక్కడిలా ఈవెంట్ ను లైవ్ టెలికాస్ట్ చేయరు. ముందు ఈవెంట్ ను గ్రాండ్ గా చేసి, ఆ తర్వాత దాన్ని ఓ ప్రోగ్రాం లాగా టీవీల్లో టెలికాస్ట్ చేస్తారు. అందుకే ఈ తమిళ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లు చాలా స్పెషల్. ఈవెంట్ లో ఏం జరిగిందో తెలసుకోవడానికి ఆడియన్స్ కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు.
మలేషియాలో జననాయగన్ ఆడియో లాంచ్
అయితే ఇప్పుడు కోలీవుడ్ లో ఓ ఆడియో లాంచ్ ను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దళపతి విజయ్ నటిస్తోన్న జన నాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ మలేషియా లో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 27న ఈ ఆడియో లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరగనుందంటున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదల
మలేషియాలోని స్టేడియం బుకిట్ జలీల్ లేదా పుత్రజయ లో ఏదొక వేదికగా జన నాయగన్ ఆడియో లాంచ్ ను చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
విజయ్ ఆఖరి సినిమాగా..
పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేస్తున్న ఆఖరి సినిమాగా జన నాయగన్ పై అందరికీ చాలా ఆసక్తి నెలకొంది. విజయ్ నటించే ఆఖరి సినిమా కూడా ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ గా తెరకెక్కుతుందని కూడా వార్తలొచ్చాయి. విజయ్ ఆఖరి సినిమా కావడంతోనే మేకర్స్ ఈ సినిమా ఆడియో లాంచ్ ను మరింత ఘనంగా నిర్వహించి, ఆయనకొక గుర్తుగా మిగల్చాలని చూస్తున్నారట. ఇప్పటివరకైతే ఇది కేవలం రుమార్ మాత్రమే. రిలీజ్ కు ఇంకా చాలా టైముంది కాబట్టి ఎప్పుడేం జరుగుతుందే ముందే చెప్పలేం.
