Begin typing your search above and press return to search.

'లియో'కు మించిన 'కార్డు'తో సీఎం సాబ్.. కానీ కంటెంట్ ఆ రేంజ్ లో ఉంటే..

ఇప్పుడు జన నాయగన్ కోసం అంతకంటే పవర్‌ ఫుల్‌ గా ఉండేలా మూవీ టీమ్ ప్రయత్నించింది.

By:  M Prashanth   |   24 July 2026 4:00 AM IST
లియోకు మించిన కార్డుతో సీఎం సాబ్.. కానీ కంటెంట్ ఆ రేంజ్ లో ఉంటే..
X

థియేటర్‌ లో హీరో ఎంట్రీకి వచ్చే టైటిల్ కార్డు.. ఒక్కోసారి సినిమా మొదలయ్యే ముందే అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అలాంటి స్పెషల్ క్రేజ్ ఉన్న హీరోల్లో తమిళ స్టార్ విజయ్ ఒకరు. ఆయన సినిమాల్లో ఇంట్రడక్షన్ కార్డులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు విజయ్ చివరి సినిమాగా వచ్చిన జన నాయగన్ లో పెట్టిన టైటిల్ కార్డు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్.. తన సినీ జర్నీకి ముగింపు పలుకుతూ జన నాయగన్ ను చివరి చిత్రంగా ప్రకటించారు. దీంతో ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని రీజన్స్ వల్ల పలుమార్లు వాయిదా పడిన ఆ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా ప్రారంభంలో వచ్చిన టైటిల్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో విజయ్ నటించిన లియో సినిమా టైటిల్ కార్డు గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు జన నాయగన్ కోసం అంతకంటే పవర్‌ ఫుల్‌ గా ఉండేలా మూవీ టీమ్ ప్రయత్నించింది. తమిళనాడు అసెంబ్లీలో విజయ్ చేసిన సిగ్నేచర్ మూమెంట్‌ ను ఆ టైటిల్ కార్డులో ఉపయోగించారు. ఇటీవల రాజకీయ వేదికపై విజయ్ చేసిన ఆ హ్యాండ్ గెస్చర్ అభిమానుల్లో బాగా వైరల్ అయింది.

అదే మూమెంట్‌ ను సినిమాకు హైలైట్‌ గా మార్చింది జన నాయగన్ టీమ్. అంతేకాదు.. సినిమాలో విజయ్‌ ను ముఖ్యమంత్రి స్థాయిలో చూపిస్తూ వేసిన టైటిల్ కూడా అభిమానుల్లో చర్చకు దారితీసింది. విజయ్ ఫ్యాన్స్ ఆ సీన్‌ ను పండగలా ఆస్వాదిస్తున్నారు. థియేటర్లలో టైటిల్ కార్డు వచ్చిన సమయంలో అభిమానుల హంగామా కనిపిస్తోంది. అయితే రాజకీయ కోణంలో మాత్రం ఆ సన్నివేశంపై విమర్శలు కూడా వస్తున్నాయి.

సినిమా విడుదలకు ముందే విజయ్‌ ను ముఖ్యమంత్రి పాత్రలో చూపించడం ఎంతవరకు సరైనదనే చర్చ జరుగుతోంది. ఇక సినిమా విషయానికి వస్తే.. విజయ్ తన మార్క్ స్టైల్, మేనరిజంతో మరోసారి ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్ సీన్లలో ఆయన అభిమానులకు కావాల్సిన అంశాలను అందించారు. అయితే కథనం విషయంలో మాత్రం అంచనాలను వినోద్ అందుకోలేకపోయారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హీరోగా విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ.. స్ట్రాంగ్ స్టోరీ, ఎఫెక్టివ్ రోల్స్ విషయంలో సినిమా వెనుకబడిందనే టాక్ వస్తోంది. ఇతర నటీనటుల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విలన్ రోల్ ను డిజైన్ చేసిన తీరు అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరోసారి తన ప్రత్యేకత చూపించారు. యాక్షన్, ఎలివేషన్ సీన్లకు తన వర్క్ తో బలం చేకూర్చారు.

ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ప్లస్‌ గా నిలిచాయి. ఏదేమైనా జన నాయగన్ లో విజయ్ అభిమానులను అలరించే అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టైటిల్ కార్డు సినిమాకు పెద్ద హైలైట్‌ గా మారింది. కానీ ఆ రేంజ్ లో కథ, కథనం కూడా బలంగా ఉండి ఉంటే విజయ్ చివరి సినిమా మరో స్థాయికి వెళ్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లియోను మించిన కార్డు ఇచ్చిన సినిమా.. అదే స్థాయిలో కంటెంట్ ఇచ్చి ఉంటే సూపర్ హిట్ గా నిలిచేదనే చర్చ సాగుతోంది.