విజయ్ 'జన నాయగన్'.. తెలుగు రిలీజ్ సంగతేంటి?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. ఇప్పుడు జన నాయగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 25 Dec 2025 4:49 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. ఇప్పుడు జన నాయగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విజయ్.. జన నాయగన్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో ఆయన కెరీర్ లో ఇదే చివరి మూవీ అని చెప్పవచ్చు.
హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న జన నాయగన్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది.
అయితే జన నాయగన్ మూవీ థియేట్రికల్ డీల్స్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. కన్నడలో కేవీఎన్ సంస్థనే రిలీజ్ చేయనుంది. తమిళంలో ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేస్తుండగా.. నార్త్ రైట్స్ ను జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. కానీ తెలుగు హక్కుల విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. కేవీఎన్ సంస్థ తాజాగా అనౌన్స్ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జన నాయగన్ మూవీని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ తో సోషల్ మీడియాలో ప్రకటించింది. నిజానికి.. టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ తెలుగు రైట్స్ దక్కించుకుంటారని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరు కూడా వినిపించింది. వారిద్దరిలో ఒకరు విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్.. రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేయడంతో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు విడుదల విషయంలో ఇది అన్ ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి.
ఇప్పటికే కొన్ని వందల సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్..
తెలుగులో రిలీజ్ చేయడం ఒకెత్తు అయితే.. ఎన్ని థియేటర్స్ లో విడుదల చేస్తుందోనన్న విషయం మరో ఎత్తు. ఎందుకంటే సంక్రాంతికి ఏకంగా ఐదు టాలీవుడ్ స్ట్రయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాల్లో జన నాయగన్ తో పాటు పరాశక్తి కూడా ఉంది.
దీంతో జన నాయగన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని స్క్రీన్స్ దక్కుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జనవరి 9వ తేదీన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ది రాజా సాబ్ కూడా విడుదల కానుంది. కాబట్టి జన నాయగన్ కు థియేటర్స్ భారీగా దొరకడం కాస్త కష్టమే. మరి చూడాలి ఏం జరుగుతుందో..
