దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి సినిమా `జన నాయగన్`. హెచ్. వినోద్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని కెవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణన్ నిర్మాంచారు.
By: Ravindar Gorantla | 9 March 2026 4:11 PM ISTదళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి సినిమా `జన నాయగన్`. హెచ్. వినోద్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని కెవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణన్ నిర్మాంచారు. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా దీన్ని రూపొందించారు. అయితే ఈ మూవీ స్టోరీని యాజిటీజ్ తీసుకోకుండా కథలో మార్పులు చేర్పలు చేసి దేశ భక్తి అంశాన్ని జోడించి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక అంశాలతో ఈ మూవీని రూపొందించారు. అవే ఇప్పుడు సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణంగా నిలిచాయి.
సెంకండ్ హాఫ్, బాబీ డియోల్ క్యారెక్టర్‌కు సంబంధించిన సన్నివేశాలు, ఏఐ హ్యమనాయిడ్ రోబోస్ కు సంబంధించిన పలు కీలక ఘట్టాలని జోడించారు. జనవరి 9న అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ బృందం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెన్సార్ సర్టిఫికెట్‌కు నిరాకరించడంతో జనవరి 9న రిలీజ్ చేయాల్సిన `జన నాయగన్` అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇక్కడి నుంచే సినిమా రిలీజ్ స్టోరీ చిత్ర విచిత్ర మైన మలుపులు తిరుగుతూ వస్తోంది.
ఫైనల్‌గా చిత్ర బృందం సెన్సార్ వారు సూచించిన కట్స్‌ని ఆమోదించి ఫైనల్ కట్‌ని రివిజన్ కమిటీకి పంపించారు. మార్చి 9, మధ్యాహ్నం 2 గంటలకు రివిజన్ కమిటీ సినిమా చూసి ఫైనల్ సర్టిఫికెట్ జారీ చేస్తుందని వార్తలు వినిపించాయి. దీంతో అందరు ఆ క్షణం కోసం ఆసక్టిగా ఎదురుచూడటం మొదలు పెట్టారు. అయితే కమిటీలో ఓ సభ్యుడికి అనారోగ్యం కారణంగా ఈ సినిమా రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. దీంతో విజయ్ అభిమానులు షాక్ కు గురవుతున్నారు. దళపతి విజయ్ నటించిన చివరి సినిమా `జన నాయగన్` ఇప్పట్లో రిలీజ్ అవుతుందా? అని నిట్టూరుస్తున్నారు.
రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ చివరి నిమిషంలో వాయిదాపడటంతో `జన నాయగన్` రిలీజ్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుందన్న నమ్మకం కూడా అభిమానుల్లో సన్నగిల్లుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో `జన నాయగన్` ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని అభిమానులు, కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఏప్రిల్ లో కుదరకపోతే జూన్‌లో అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
జూన్ 22న దళపతి విజయ్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలోనే మేకర్స్ ఈ మూవీని జూన్ 18న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారని తెలిసింది. ఆ రోజైనా `జన నాయగన్` రిలీజ్ అవుతుందా? లేక ఎప్పటిలాగే రిలీజ్ వాయిదా పడి షాక్ ఇస్తుందా? అనే చర్చ జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రలో మమితా బైజు నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్, నరేన్, రెబామోనిక జాన్ తదతరులు నటిస్తున్నారు.
