'జన నాయగన్' టీమ్ వెనక్కి తగ్గుతోందా?
జనవరి 9న రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సెన్సార్ బోర్డ్ షాక్ ఇవ్వడంతో డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా పరిస్థితి తలకిందులైంది.
By: Tupaki Entertainment Desk | 2 Feb 2026 4:16 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `జన నాయగన్`. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. జనవరి 9న రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సెన్సార్ బోర్డ్ షాక్ ఇవ్వడంతో డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా పరిస్థితి తలకిందులైంది.
అప్పటి నుంచి సినిమా రిలీజ్ కోసం మేకర్స్ మద్రాస్ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మొదట మేకర్స్ వాదనలు విన్న సింగిల్ జడ్జ్ 'జన నాయగన్'కు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ తీర్పును సీబీఎఫ్‌సీ సవాల్ చేస్తూ హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని కోరడంతో `జన నాయగన్` రిలీజ్ వాయిదాపడింది. అప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్ చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ వస్తోంది.
సెన్సార్ సమస్య కారణంగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. ఆ తరువాత అది జనవరి 26కు మారినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ హీరో విజయ్ చుట్టూ పొలిటికల్ గేమ్ నడుస్తున్న కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని తమిళనాట ప్రచారం జరుగుతుంటే తనని ఎవరూ అడ్డుకోలేరని, ఏ శక్తికి తాను లొంగనని రీసెంట్‌గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో దళపతి విజయ్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ మూవీ రిలీజ్ రోసం టీమ్ వెనక్కి తగ్గుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ ఇంకా ఆలస్యం కాకూడదంటే సీబీఎఫ్‌సీపై వేసిన కేసుని వెనక్కి తీసుకునే అలోచనలో మేకర్స్ ఉన్నారనే ఊహాగానాలు ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతే కాకుండా థియేటర్లలో సీబీఎఫ్‌సీ విధించిన కట్‌లని అమలు చేసి ట్రిమ్డ్ వెర్షన్‌ని రిలీజ్ చేస్తారని, ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో మాత్రం అన్ కట్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరగుతోంది. దీనిపై స్పష్టత రావాలంటే మేకర్స్ నుంచి 'జన నాగయన్' రిలీజ్‌పై అధికారిక ప్రకటన రావాల్సిందే.
తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ 'భగవంత్ కేసరి' ఆధారంగా ఈ సినిమాని రీమేక్ చేశారు. కొంత పార్ట్, ప్రధాన స్టోరీ లైన్‌ని యదాతదంగా తీసుకున్న మేకర్స్ విలన్ పోర్షన్‌ని మాత్రం కంప్లీట్‌గా మార్చేసి విజయ్ రాజకీయ ఎంట్రీకి పనికొచ్చేలా పొలిటికల్ టచ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మమితా బైజు, పూజా హెగ్డే, ప్రియమణి, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రెబా మోనికా తదితరులు ప్రాధాన పాత్రల్లో నటించారు.
