'జన నాయగన్' రిలీజ్‌కు ముందే రికార్డ్స్!
దళపతి విజయ్ నటించిన చివరి యాక్షన్ డ్రామా `జన నాయగన్`. ఈ మూవీ చుట్టూ గత కొన్ని రోజులుగా సెన్సార్ వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
By: Tupaki Entertainment Desk | 20 Jan 2026 1:02 PM ISTదళపతి విజయ్ నటించిన చివరి యాక్షన్ డ్రామా `జన నాయగన్`. ఈ మూవీ చుట్టూ గత కొన్ని రోజులుగా సెన్సార్ వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. జనవరి 9న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందు ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ అడ్డంకులు తలెత్తడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో విజయ్ అభిమానులు, సినీ లవర్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలకు సంబంధించి కొన్ని అభ్యంతరాలున్నాయని, మళ్లీ రివిజన్ కమిటీకి పంపించాలని సీబీఎఫ్‌సీ మేకర్స్‌కు సూచించింది.
దీంతో ఆగ్రహించిన మేకర్స్ సెన్సార్ పై మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం.. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని కోర్టు ఆదేశాలు జారీ చేయడం, దాన్ని సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌కి వెళ్లి స్టే తీసుకురావడం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫైనల్ హియరింగ్ జనవరి 20 మంగళవారం చెన్నై హైకోర్టులో జరుగుతోంది. మరి కొన్ని గంటల్లో సెన్సార్ వివాదంపై తుది తీర్పు రాబోతోంది. దీని కోసం విజయ్ అభిమానులతో పాటు సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో `జన నాయగన్` రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డుని సాధించడం విశేషం.
సినిమా రిలీజ్‌కు ముందే `జన నాయగన్` ప్రేక్షకుల అటెన్ష్‌ని గ్రాబ్ చేయడంతో బెంచ్ మార్క్‌ని సెట్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్‌మై షోలో రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపింది. వన్ మిలియన్‌కు మించి ప్రేక్షకులు `జన నాయగన్` కోసం ఆసక్తిగా ఉన్నారట. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే రికార్డు స్థాయిలో ప్రేక్షకుల అటెన్షన్‌ని గ్రాబ్ చేసిన సినిమాగా `జన నాయగన్` రికార్డు సాధించింది.
రిలీజ్‌కు ముందు నుంచి సెన్సార్ వివాదంలో చిక్కుకున్న `జన నాయగన్` ఇప్పుడు ఇలా వార్తల్లోకి ఎక్కడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మంగళవారం కూడా కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే సెలబ్రేషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ మూవీ విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే `జన నాయగన్`కు అన్ని వర్గాల నుంచి సపోర్ట్ భారీ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. అదే బుక్ మై షో రికార్డులోనూ కనిపించిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ మూవీని తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే సెకండ్ పార్ట్‌ని మాత్రం చాలా వరకు మార్చేసి వినల్ క్యారెక్టర్‌ని మరింత పవర్‌ఫుల్‌గా మార్చారు. బాబీ డియోల్ క్యారెక్టర్‌తో కంప్లీగా సెకండ్ హాఫ్‌ని మార్చేశారు. ఆ సన్నివేశాలే ఇప్పుడు సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకునేలా చేసినట్టుగా తెలిసింది. ఇండియన్ ఆర్మీని నెగెటివ్‌గా ప్రజెంట్ చేసిన తీరు, ఓ కమ్యూనిటీని కించపరచిన సన్నివేశాలు ఉన్నందువల్లే `జన నాయగన్` చుట్టూ సెన్సార్ వివాదం మొదలైందని ఇన్ సైడ్ టాక్.
