2026లో బాండ్ ఫ్రాంఛైజీ కొత్త సినిమా ప్రకటన
దశాబ్ధాలుగా జేమ్స్ బాండ్- 007 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 20 Oct 2025 5:00 PM ISTదశాబ్ధాలుగా జేమ్స్ బాండ్- 007 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వినాశనానికి కారకులయ్యే విలన్లను అంతమొందించేందుకు బాండ్ చేసే సాహస విన్యాసాలను ప్రేక్షకులు ఆస్వాధించారు. ఫ్రాంఛైజీలో 25 సినిమాలు తెరకెక్కాయి. చివరి మూడు సినిమాల్లో డేనియల్ క్రెయిగ్ కథానాయకుడి పాత్రను పోషించాడు. అతడి నటనకు గొప్ప గుర్తింపు దక్కింది. బాండ్ సిరీస్ సినిమాలు అసాధారణ వసూళ్లతో అదరగొట్టాయి.
అందుకే ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలన్న కుతూహాలం అభిమానులకు ఉంది. తాజా సమాచారం మేరకు కొత్త సినిమా 2026లో ప్రారంభం కానుంది. ఇందులో కొత్త జేమ్స్ బాండ్ పాత్రలో స్పైడర్ మేన్ ఫేం టామ్ హాలండ్ నటిస్తాడని భావిస్తున్నా కానీ, అతడు ప్రస్తుతానికి పోటీలో లేడు.
దీనికి కారణం అతడు ఇప్పటికే మార్వెల్ తో చేసుకున్న ఒప్పందం. ఒకేసారి రెండు భారీ చిత్రాల్లో సూపర్ మేన్ తరహా పాత్రలను చేయకూడదనే నిబద్ధతతో ఒప్పంద పత్రంపై సంతకం చేసాడు గనుక ఇది సాధ్యపడదని డెయిలీ మెయిల్ డాట్ యూకే పేర్కొంది. స్పైడర్ మేన్ ఇమేజ్ ని తగ్గించే ఏ ఇతర పాత్రలోను అతడు నటించకూడదని ఒప్పందం స్పష్ఠం చేస్తోంది. అందువల్ల అతడికి ఆసక్తి ఉన్నా బాండ్ సిరీస్ లో కొనసాగడం కుదరదని కూడా తెలుస్తోంది.
ఆసక్తికరంగా నేటి జెన్ జెడ్ తో ముడిపడిన ఏఐ సాంకేతికతను, కృత్రిమ మేధస్సుతో తలెత్తే ప్రమాదాలను కొత్త బాండ్ సినిమాలో చూపించబోతున్నారు. నిజానికి చాలా సూపర్ హీర్ ఫ్రాంఛైజీ చిత్రాలలో ఏఐ సాంకేతికత ముప్పు గురించి చూపిస్తున్నారు గనుక బాండ్ సినిమాలో దీనిని వేరే లెవల్ లో చూపిస్తారని టాక్ వినిపిస్తోంది.
ఇడ్రిస్ ఎల్బా, టామ్ హార్డీ, ఆరోన్ టేలర్, జాన్సన్, జాకబ్ ఎలోర్డి, హారిస్ డికిన్సన్ లాంటి స్టార్లు ఇప్పటికే ఫ్రాంఛైజీ స్టార్లుగా అలరించారు. కొత్త సినిమాలో ఎవరు నటించబోతున్నారో వేచి చూడాలి. దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ తనకు నచ్చిన తెలియని బ్రిటిష్ వ్యక్తిని జేమ్స్ బాండ్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించారు. తదుపరి జేమ్స్ బాండ్ కోసం అతడు ప్రస్తుతం సెర్చ్ చేస్తున్నాడు.
