జైలర్ 3 ముందే ఫిక్స్ చేసేసారా?
బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన జైలర్ ఫ్రాంచైజీ నుంచి దిగ్గజ నటుడు రజినీకాంత్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ వార్త బయటకు వచ్చింది.
By: Srikanth Kontham | 10 Oct 2026 10:31 PM ISTబాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన జైలర్ ఫ్రాంచైజీ నుంచి దిగ్గజ నటుడు రజినీకాంత్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ వార్త బయటకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగునాట అపారమైన ఆదరణ సొంతం చేసుకున్న జైలర్ సీక్వెల్ జైలర్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అయితే రెండో భాగం థియేటర్లలో సందడి చేయక ముందే? దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ `జైలర్ 3`కి సంబంధించిన ప్లానింగ్‌ను కూడా ఖరారు చేశారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పాన్-ఇండియా స్థాయిలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ చర్చల వెనుక క్ష ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. దర్శకుడు నెల్సన్ ఇప్పటికే జైలర్ 3`కి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ కథాంశాన్ని సిద్ధం చేసి సూపర్ స్టార్ రజినీకాంత్‌కు వినిపించారని తెలుస్తోంది. నెల్సన్ చెప్పిన లైన్ తలైవాకు నచ్చడంతో రజినీకాంత్ వెంటనే ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. దీంతో `జైలర్ 2 విడుదల కాకముందే మూడో భాగం కూడా దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.
త్వరలో విడుదల కాబోతున్న జైలర్ 2 క్లైమాక్స్‌లోనే మూడో భాగానికి సంబంధించిన సాలిడ్ లీడ్‌ను భారీ సర్ ప్రైజ్ రూపంలో రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా ముగింపు ఘట్టంలో ఇచ్చే ఈ ట్విస్ట్ లేదా హింట్ జైలర్ 3`పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లేలా నెల్సన్ ప్లాన్ చేశారట. ఈ వార్త నిజమైతే? థియేటర్లలో `జైలర్ 2 చూసే ప్రేక్షకులకు విపరీతమైన కిక్ రావడం ఖాయం.
తలైవా రజినీకాంత్ కెరీర్‌లో జైలర్ చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పరాజయాల్లో ఉన్న సూపర్ స్టార్ ను మళ్లీ బాక్సాఫీస్ విజేతగా నిలిపిన చిత్రం కావడంతో ఈ ఫ్రాంచైజీపై రజినీకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చే ప్రతీ పార్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జైలర్ 2 తెలుగు హక్కులను ఓ ప్రముఖ నిర్మాత ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోవడంతో ఇక్కడ కూడా సినిమాపై భారీగా బిజినెస్ బజ్ నెలకొంది.
అయితే జైలర్ 3 ప్రాజెక్ట్ అనుకున్న రీతిలో పట్టాలెక్కాలంటే ముందుగా విడుదల కానున్న జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాల్సి ఉంటుంది. సీక్వెల్ గనుక అంచనాలను అందుకుని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిస్తే నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడో భాగాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ముందడుగు వేస్తుంది. ఇక ముత్తువేల్ పాండ్యన్ మూడోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి మార్గం సుగమం అవుతుంది.
మొత్తానికి జైలర్ 2 ముగింపులోనే జైలర్ 3 లీడ్ ఉంటుందన్న వార్త రజినీకాంత్ అభిమానులను, సినీ ప్రియులను ఖుషీ చేస్తోంది. ప్రసుతం తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే విడుదల కాబోతున్న జైలర్ 2 వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో? అలాగే నెల్సన్ ఇచ్చే ఆ సర్ ప్రైజ్ లీడ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
