జైలర్ 2 బిజినెస్ డీటెయిల్స్.. తెలుగు హక్కులపై వీడని ఉత్కంఠ!
జైలర్ 2 సినిమా నాన్ థియేట్రికల్, ఓటీటీ డీల్ మొత్తం రూ.160 కోట్లు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది అతి పెద్ద డీల్ అని చెప్పాలి.
By: Madhu Reddy | 6 Sept 2026 10:30 AM ISTసౌత్ సూపర్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రజనీకాంత్ కెరియర్ ముగిసిపోయింది అనుకునే సమయంలో.. జైలర్ సినిమా ఆయనకు ఊహించని పాపులారిటీని అందించి పెట్టింది .ముఖ్యంగా బుట్ట సర్దేయాల్సిన టైం వచ్చింది అని, విమర్శలు గుప్పించిన వారికి ఈ సినిమా భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. అలా జైలర్ సినిమాతో ఊహించని క్రేజ్ ను సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఈ సినిమాకి కొనసాగింపుగా జైలర్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 15వ తేదీన దసరా సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మరొకవైపు ఈ సినిమా బిజినెస్ ఏ మేరా జరిగింది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా పాన్ ఇండియా భాషలో విడుదల కాబోతున్న ఈ జైలర్ 2 సినిమా హక్కులను తెలుగులో ఏ నిర్మాత తన నిర్మాణ సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో ఆసక్తిని కలిగిస్తోంది. మరి జైలర్ 2 సినిమా బిజినెస్ హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారు? తెలుగు సినిమా హక్కులను ఏ నిర్మాత దక్కించుకోబోతున్నారు ?అనే విషయాలు వైరల్ గా మారాయి.
జైలర్ 2 సినిమా నాన్ థియేట్రికల్, ఓటీటీ డీల్ మొత్తం రూ.160 కోట్లు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది అతి పెద్ద డీల్ అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా హక్కులను సుమారుగా రూ.250 నుండి రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించింది. అటు ఈ సినిమా థియేటర్ హక్కుల కోసం తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. సుమారుగా రూ.55 కోట్ల వరకు డిమాండ్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాగ వంశీ తన ప్రతిపాదనను చిత్ర నిర్మాణ సంస్థ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఈ డీల్ ఫై ఫైనల్ నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు సినీవర్గాలలో చర్చ జరుగుతోంది.
అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ ప్రాతిపదికన సినిమాను రిలీజ్ చేసేందుకు ఏషియన్ సునీల్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఈ వ్యవహారంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సహకారం కూడా ఉండవచ్చు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ నాగ వంశీ తెలుగు రైట్స్ ని గనుక సొంతం చేసుకుంటే.. స్వయంగా ఆయనే రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా డైరెక్టర్ నెల్సన్ తో నాగ వంశీకి ఉన్న సన్నిహిత అనుబంధం కూడా ఈ డీల్ లో చాలా కీలకంగా మారింది.. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలలో ఓటీటీ హక్కులను ఎవరు సొంతం చేసుకోబోతున్నారనే ఉత్కంఠ పెద్ద ఎత్తున నెలకొంది. మరి ఈ ఉత్కంఠ వారంలో వీడనుంది.
