జైలర్ 2 : ఎస్ జే సూర్యకి సీక్వెల్ టెన్షన్
ప్రతి సినిమాలోనూ ఒకే తరహా పాత్ర, ఒకే తరహా విలనిజం ప్రదర్శించడం వల్ల మొత్తానికి ఆసక్తి పోతుందని, అసలు సూర్య విలన్‌గా అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
By: Ramesh Palla | 7 Oct 2026 1:03 PM ISTదర్శకుడిగా 'ఖుషి' వంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నో తీసిన ఎస్‌జే సూర్య ఇప్పుడు నటుడిగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కంటే ఎక్కువగా విలన్ పాత్రలను సూర్య చేస్తున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు, అంతకు మించి చేస్తూ టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ఎస్ జే సూర్య ఈనెలలో 'జైలర్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందిన జైలర్ 2 లో ఎస్ జే సూర్య పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సినిమాలో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ మధ్య కాలంలో సూర్యకు విలన్ రోల్స్ కలిసి రావడం లేదు. ఆయన అభిమానులు స్వయంగా ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు విలన్ అంటే ఇలా ఉండాలి అనుకున్న వారు కాస్త ఇప్పుడు సూర్య ను విలన్‌గా చూడలేక పోతున్నామని కొందరు అంటున్నారు.
ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో సర్దార్ 2...
ప్రతి సినిమాలోనూ ఒకే తరహా పాత్ర, ఒకే తరహా విలనిజం ప్రదర్శించడం వల్ల మొత్తానికి ఆసక్తి పోతుందని, అసలు సూర్య విలన్‌గా అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎస్ జే సూర్య విలన్ పాత్రలను కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కాస్త మెయిన్ లీడ్ రోల్ తీసుకుని చేస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు. ఇదే సమయంలో సూర్య నటించిన ఇండియన్ 2, సర్దార్ 2 సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. జైలర్ 2 సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఎస్ జే సూర్య పాత్ర గురించి, ఆయన గత చిత్రాల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సూర్యకు సీక్వెల్స్ లో నటిస్తే కలిసి రావడం లేదు అని కొందరు అంటే, ఇప్పుడు జైలర్ 2 తో ఆ సెంటిమెంట్ కు గండి కొడతాడని మరికొందరు అంటున్నారు. తప్పకుండా జైలర్ 2 తో సూర్య కమర్షియల్ హిట్ కొట్టడంతో పాటు, తన పాత్రతో అలరిస్తాడని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్, నెల్సన్ దిలీప్ జైలర్ 2...
నెల్సన్ దిలీప్ తన సినిమాలోని పాత్రలకు మంచి నటీనటులను ఎంపిక చేస్తాడనే టాక్ ఉంది. కనుక సూర్యకు సరిపోయే మంచి పాత్ర దక్కి ఉంటుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. రజనీకాంత్‌తో పాటు సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కపూర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, బాలీవుడ్ స్టార్ నటి విద్యా బాలన్ ఇంకా ఎంతో మంది స్టార్ నటీనటులు ఉన్న నేపథ్యంలో జైలర్ 2 పై అంచనాలు పెరుగుతున్నాయి. ఎస్ జే సూర్య కు ఇంత మంది స్టార్ కాస్ట్ మధ్య మంచి పాత్ర దక్కి ఉంటుందా అనే అనుమానం ను కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్ లో మంచి స్కోప్ దక్కడంతో పాటు, స్క్రీన్ ప్రజెన్స్ దక్కడంతో కచ్చితంగా ఎస్ జే సూర్యకు ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుందని చాలా మంది అంటున్నారు. అయితే సీక్వెల్స్ టెన్షన్ మాత్రం కొంతదరు అభిమానుల్లో కనిపిస్తోంది.
టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీగా జైలర్ 2 రిలీజ్...
టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఎస్ జే సూర్య కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఆయన పాత్రలు సైతం మూస పద్దతిలో ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అందుకే ఎస్ జే సూర్యకు జైలర్ 2 సక్సెస్ అనేది అత్యంత కీలకం అని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా ఈ సినిమా కు పాజిటివ్ ఫలితం రావాలని కోరుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన జైలర్ 2 సినిమాలో రజనీకాంత్ పాత్రతో పాటు, ప్రతి పాత్ర ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని, కథ ను ముందుకు తీసుకు వెళ్లే విధంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ ఇస్తున్న సంగీతం సినిమా స్థాయిని పెంచడం ఖాయం. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. కనుక అక్టోబర్ 15న విడుదల కాబోతున్న జైలర్ 2 సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
