Begin typing your search above and press return to search.

షారుఖ్ గెస్ట్ రోల్.. ఈసారైనా క‌లిసొస్తుందా?

ఈ నేప‌థ్యంలోనే ఎంతోమంది స్టార్లు మ‌రొక‌రి సినిమాల్లో గెస్టు రోల్స్ లో చేసి మెప్పించిన సంద‌ర్భాలున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Feb 2026 3:00 PM IST
షారుఖ్ గెస్ట్ రోల్.. ఈసారైనా క‌లిసొస్తుందా?
X

ఒక స్టార్ హీరో సినిమాలో మ‌రొక‌రితో క్యామియో చేయించ‌డం ఎప్ప‌ట్నుంచో చూస్తున్నాం. అయితే ఈ మ‌ధ్య ఆ ఆచారం ఇంకాస్త ఎక్కువైంది. ఆల్రెడీ స్టార్ హీరో సినిమా అంటే మంచి క్రేజ్ ఉంటుంది. దానికి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా మ‌రో స్టార్ తో గెస్టు రోల్ చేయిస్తే ఆ క్రేజ్ ఇంకాస్త పెరిగి, సినిమాకు మంచి బ‌జ్ ఏర్ప‌డ‌టంతో పాటూ స‌ద‌రు గెస్టు రోల్ చేసే అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తారు కాబ‌ట్టి క‌లెక్ష‌న్ల విష‌యంలో కూడా ఇది మేక‌ర్స్ కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారులో వెంక‌టేష్ గెస్టు రోల్

ఈ నేప‌థ్యంలోనే ఎంతోమంది స్టార్లు మ‌రొక‌రి సినిమాల్లో గెస్టు రోల్స్ లో చేసి మెప్పించిన సంద‌ర్భాలున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వ‌చ్చిన మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీలో విక్ట‌రీ వెంక‌టేష్ అలానే గెస్టు రోల్ చేసి మెప్పించ‌గా, ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాదు, అన్నీ భాష‌ల్లోనూ ఈ గెస్ట్ అప్పీరియెన్సులు చూస్తూనే ఉన్నాం.

జైల‌ర్ లో శివ‌రాజ్ కుమార్, మోహ‌న్ లాల్ క్యామియోలు

ఇక అస‌లు విష‌యానికొస్తే సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న జైల‌ర్2 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. జైల‌ర్ రిలీజైన ఆగ‌స్టులోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేసి ఆగ‌స్టు సెంటిమెంట్ ను వాడుకోవాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. జైల‌ర్‌లో శివరాజ్ కుమార్, మోహ‌న్ లాల్ గెస్టు రోల్స్ చేయ‌గా, వారి పాత్ర‌ల‌కు మంచి పేరు రావ‌డంతో పాటూ వారి పాత్ర‌లు సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఇప్పుడు జైల‌ర్2లో వారి పాత్ర‌ల నిడివి మ‌రింత పెర‌గ‌బోతుంద‌ని స‌మాచారం.

జైల‌ర్2 లో షారుఖ్

వీరిద్ద‌రూ మాత్ర‌మే కాకుండా జైల‌ర్2లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. మేక‌ర్స్ నుంచి ఈ విష‌యంలో ఎలాంటి అఫీషియ‌ల్ అప్డేట్ లేక‌పోయినా, ఈ వార్త నిజ‌మ‌య్యే అవ‌కాశాలే ఎక్కువ ఉన్నాయి. దానికి కార‌ణం గ‌తంలో షారుఖ్ న‌టించిన రా వ‌న్ మూవీలో ర‌జినీకాంత్ అడ‌గ్గానే రోబో గెట‌ప్ వేసుకుని ఓ ఫైట్ చేశారు. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, ర‌జినీకాంత్ ఆ మూవీలో భాగ‌మైనందుకు షారుఖ్, సూప‌ర్ స్టార్ కు కృత‌జ్ఞుడిగానే ఉన్నారు. ఇప్పుడు షారుఖ్ కు ఆ రుణం తీర్చుకునే ఛాన్స్ రావ‌డంతో జైల‌ర్2 లో న‌టించే అవ‌కాశాలే ఎక్కువ ఉన్నాయి.

ప‌లు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన షారుఖ్

అయితే షారుఖ్ గ‌తంలో కూడా ప‌లు సినిమాల్లో గెస్టు రోల్స్ చేశారు. హే రామ్, షారుఖ్ బోలా ఖుబ్సూర‌త్ హై తూ, బిల్లు, దుల్హా మిల్ గ‌యా, ల‌క్ బై ఛాన్స్, ఏ దిల్ హై ముష్కిల్, బ్ర‌హ్మాస్త్ర‌, లాల్ సింగ్ చ‌ద్దా, రాకెట్రీ సినిమాల్లో అతిథి పాత్రల్లో క‌నిపించారు. ఏ దిల్ హై ముష్కిల్ మిన‌హా ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ను అందుకున్నది లేదు. అయితే షారుఖ్ గెస్టు రోల్ చేసిన సినిమాల ఫ‌లితాలు ఎలా ఉన్నా, ఆయ‌న పాత్ర‌ల‌తో సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచార‌నేది మాత్రం నిజం.

నార్త్ లో మంచి బిజినెస్ ద‌క్కే అవ‌కాశం

వాస్త‌వానికి జైల‌ర్2లో గెస్టు రోల్ కోసం ముందు బాల‌కృష్ణ‌ను అనుకున్నారు. మ‌రి ఇప్పుడ‌దే పాత్ర‌ను షారుఖ్ చేస్తున్నారా లేదా ఇది మ‌రో పాత్ర‌నా అనేది తెలియాల్సి ఉంది. అయితే షారుఖ్ వ‌ల్ల జైల‌ర్2 కు నార్త్ లో మంచి బిజినెస్ ద‌క్కే అవ‌కాశ‌ముంది. మ‌రి ఈ స్పెష‌ల్ రోల్ ను నెల్స‌న్ ఎలా డిజైన్ చేశార‌నేది చూడాలి. షారుఖ్ గెస్ట్ రోల్ చేసిన సినిమాల్లో ఎక్కువ‌గా ఫ్లాపులే ఉన్న నేప‌థ్యంలో జైల‌ర్2 ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. జైల‌ర్ హైప్, అందులోని క్యామియోల‌ను చూసి, ఈ సినిమా కోలీవుడ్ లో మొద‌టి వెయ్య కోట్ల గ్రాస‌ర్ అవుతుంద‌ని త‌మిళ ఆడియ‌న్స్ మ‌ళ్లీ అంచ‌నాలు వేస్తున్నారు. రీసెంట్ గా కంగువ‌, కూలీ సినిమాల‌కు కూడా ఇదే రేంజ్ లో హైప్ చేయ‌గా, ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాల‌ను అందుకోలేక బోల్తా ప‌డిన సంగ‌తి తెలిసిందే.