'జైలర్' సాబ్ ఈ సారి అల్లాడిస్తాడా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `జైలర్`. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు.
By: Ravindar Gorantla | 22 Feb 2026 1:00 AM ISTసూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `జైలర్`. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు. వరుస ఫ్లాపుల తరువాత రజనీ నుంచి వచ్చిన సినిమా కావడంతో దీనిపై ముందు ఎలాంటి అంచనాలు లేవు. కానీ రిలీజ్ తరువాత మాత్రం సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. మౌత్ టాక్ పతాక స్థాయికి చేరడం, రజనీ సరికొత్తగా తన ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్‌లో కనిపించడం, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి రజనీ సినిమాల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్‌లని రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు. రజనీకాంత్‌తో పాటు ఫస్ట్ పార్ట్‌లో నటించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యెగిబాబు నటిస్తుండగా ఈ మూవీలో మాత్రం మరో ఇద్దరు కొత్త వారు అన్న రాజన్, జస్టిన్ శర్మ, కీలక విలన్ క్యారెక్టర్‌లో ఎస్.జె. సూర్య నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ మిథున్ చక్రవర్తి కనిపించనుండటం గమనార్హం.
ఇక అతిథి పాత్రల్లో ఫస్ట్ పార్ట్‌లో నటించిన శివరాజ్ కుమార్, మోహన్‌లాల్‌తో పాటు విజయ్ సేతుపతి కూడా కనిపించనున్న విషయం తెలసిందే. అయితే వీరితో పాటు మరో కీలక అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూడా నటిస్తున్నాడని వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో షారుక్ నటిస్తున్నది నిజమేనని తేలింది. షారుక్ ఖాన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలని 7 నుంచి 8 రోజుల్లో పూర్తి చేస్తారట. షారుక్ ఈ మూవీ షూటింగ్‌లో మార్చిలో పాల్గొంటారని ఇన్ సైడ్ టాక్.
`జైలర్`కు మించి `జైలర్ 2`లోని కీలక పాత్రల్లో ఎస్.జె.సూర్య, మిథున్ చక్రవర్తి, అతిథి పాత్రల్లో షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ నటిస్తుండటంతో జైలర్ సాబ్ ఈ సారి థియేటర్లని తనదైన మ్యాజిక్‌తో అల్లాడిస్తాడని, బాక్సాఫీస్ ని ఈ క్రేజీ కాంబినేషన్ షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలతో పాటు రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రజనీ, కమల్‌ల కాంబినేషన్ మూవీ టీజర్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కొంత ఆలస్యం అవుతూ వచ్చింది.
దీంతో ఈ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికి రావడం లేదని, త్వరలోనే టీమ్ మరో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారని తెలిసింది. `కూలీ` మూవీలో ఆమీర్‌కాన్ గెస్ట్ రోల్‌లో కనిపించడం తెలిసిందే. భారీ స్థాయిలో రూపొందినా సినిమా మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరి షారుక్ గెస్ట్ రోల్ చేస్తున్న `జైలర్` బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
