Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ చిత్రాల వెనుక మాస్టర్ ప్లాన్!

ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా రజనీకాంత్ సూచనలను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఒకప్పుడు సూపర్‌స్టార్ సినిమాలంటే కేవలం ఆయన ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సాగేవి.

By:  Srikanth Kontham   |   13 July 2026 5:00 PM IST
సూప‌ర్ స్టార్  చిత్రాల వెనుక మాస్టర్ ప్లాన్!
X

ఇండియ‌న్ సినిమాకు సూప‌ర్ స్టార్ రజనీకాంత్ అంటే ప్రత్యేకమైన బ్రాండ్. దశాబ్దాలుగా తన ఇమేజ్‌తోనే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చ‌రిత్ర ఆయ‌న సొంతం. అయితే ఈ మ‌ధ్య కాలంలో ర‌జ‌నీ కాంత్ సినిమాల‌ నిర్మాణ శైలిలో ఆసక్తికరమైన మార్పులు క‌నిపిస్తున్నాయి. ఈ రెండు మూడేళ్ల కాలంలో రిలీజ్ అయిన‌ `జైలర్, `వెట్టేయాన్`, `కూలీ` అప్ క‌మింగ్ రిలీజ్ `జైలర్ 2` వంటి చిత్రాలను గమనిస్తే? రజనీకాంత్ సోలో హీరోగా మాత్రమే కాకుండా భారీ తారాగణంతో కూడిన మల్టీ-స్టారర్ కథలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు క‌నిపిస్తుంది.

ఈ భారీ మార్పు వెనుక ఉన్న అసలు కర్త ఎవ‌రో? కాదు. స్వయంగా రజనీకాంత్ అని సమాచారం.`దర్బార్`..అంతకు ముందు వచ్చిన కొన్ని చిత్రాల తర్వాత కేవలం తన ఇమేజ్‌పైనే ఆధారపడకుండా ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉన్న బలమైన సపోర్టింగ్ క్యాస్టింగ్ ఉన్న కథలను ఎంచుకోవాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. దర్శకులకు తన వంతుగా సలహాలు ఇవ్వడమే కాకుండా? ఇతర భాషల అగ్ర నటులను కూడా చిత్రంలో భాగం చేయాలని ర‌జ‌నీ స్వయంగా ఆదేశిస్తున్నారని తెలిసింది.

`జైలర్` చిత్రం ఈ వ్యూహానికి నిదర్శనంగా నిలిచింది. శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ వంటి ఇతర భాషల దిగ్గజ నటులను ఒకే తెరపైకి తీసుకురావడం ద్వారా సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ప్రేక్షకులకు గొప్ప విజువల్ ట్రీట్ అందించారు. తాజాగా `జైలర్ 2` లో కూడా అంతకు మించిన భారీ క్యాస్టింగ్ క‌నిపిస్తుంది. దీని కోసం రజనీకాంత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నార‌ని తెలిసింది. ఇది కేవలం మార్కెటింగ్ ట్రిక్ మాత్రమే కాదు. కథలో ఉన్న లోతును పెంచడానికి ఆయన చేస్తున్న ఓ ప్రయత్నం కూడా.

ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా రజనీకాంత్ సూచనలను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఒకప్పుడు సూపర్‌స్టార్ సినిమాలంటే కేవలం ఆయన ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సాగేవి. కానీ ఇప్పుడు మల్టీ-స్టారర్ ఫార్మాట్ వల్ల ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకర్షించే అవకాశం మెరుగుపడింది. భారీ బడ్జెట్ చిత్రాల రిస్క్ తగ్గుతుందని అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమాలు చేరువవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు.

ఈ మార్పు వెనుక ర‌జ‌నీకాంత్ పరిణితి చెందిన ఆలోచన కనిపిస్తుంది. తన వయసుకు, అనుభవానికి తగ్గట్టుగా పాత్రలను ఎంచుకుంటూనే? తన సినిమాల స్థాయిని పాన్-ఇండియా స్థాయిలో నిలబెట్టడానికి ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం. స్టార్ హీరోలు ఇమేజ్ నుంచి బయటపడి కథకు ప్రాధాన్యతనిస్తూ ఇతర నటులతో కలిసి పని చేయడం సినిమా భవిష్యత్తుకు మంచి సంకేతంగా చెప్పొచ్చు.

రజనీకాంత్ తీసుకొస్తున్న ఈ మార్పు టాలీవుడ్ - కోలీవుడ్ తదితర పరిశ్రమలలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. అభిమానులకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌ను అందిస్తూనే కంటెంట్ పరంగా రాజీ పడకుండా భారీ తారాగణంతో సినిమాలను రూపొందించడం తారకమంత్రంలా మారింది. భ‌విష్య‌త్ లో రజనీకాంత్ మరిన్ని అద్భు తాలను ఈ తరహా చిత్రాల ద్వారా చూపిస్తారో? చూడాలి.