Begin typing your search above and press return to search.

'జైల‌ర్ 2' లో ఆ ర‌క‌మైన టెన్ష‌న్ ఏమాత్రం లేదే!

అలాగే కంటెంట్ , మేకింగ్ పై ఉన్న నమ్మకంతో చిత్రబృందం ఎక్కడా రాజీ ప‌డ‌లేదు. ఇటీవల ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యాక్షన్ డోస్ కారణంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చినా?

By:  Srikanth Kontham   |   18 Sept 2026 4:00 AM IST
జైల‌ర్ 2 లో ఆ ర‌క‌మైన టెన్ష‌న్ ఏమాత్రం లేదే!
X

తమిళ చిత్రసీమలో సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సందర్భాలు అనేకం ఉన్నా? `జైలర్ 2` విషయంలో చిత్రబృందంలో ఆ రకమైన టెన్షన్ ఏమాత్రం క‌నిపించ‌లేదు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం తర్వాత జైల‌ర్ సీక్వెల్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. సాధారణంగా కోలీవుడ్‌లో సీక్వెల్స్ అనగానే నెలకొనే అనుమానాలు, సెంటిమెంట్లను పక్కన బెట్టి `జైలర్ 2` మేకర్స్ ఎంతో ధీమాగా ఉన్నారు.

కోలీవుడ్ చరిత్రను గమనిస్తే బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత వచ్చిన పార్ట్-2 చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. మొదటి భాగంలో ఉన్న కొత్తదనం, బిగువైన కథనం రెండో భాగంలో లోపించడంతో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ ట్రాక్ రికార్డ్ కారణంగా తమిళ పరిశ్రమలో ఏ పెద్ద సినిమాకు సీక్వెల్ ప్రకటించినా పంపిణీదారులు, మేకర్స్‌లో ఒకరకమైన భయం, ఒత్తిడి నెలకొనడం సహజం.

అయితే ఈ సీక్వెల్ సెంటిమెంట్ భయం `జైలర్ 2` టీమ్‌ను రవ్వంతైనా తాకలేదు. సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ , కళానిధి మారన్ ప్రశాంతంగా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మొదటి భాగం విజయా నికి కొనసాగింపుగా పేరుకు మాత్రమే సీక్వెల్ తీయకుండా కథలో అసలైన ఇంటెన్సిటీ, బలమైన డ్రామాను జోడించి పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ సిద్ధం చేయడం ఈ ధీమాకు కారణం కావొచ్చు. `ముత్తువేల్ పాండియన్` పాత్రలో మాస్ పవర్ ఈ సీక్వెల్‌లో మరో స్థాయిలో ఉండబోతోందని సమాచారం.

అలాగే కంటెంట్ , మేకింగ్ పై ఉన్న నమ్మకంతో చిత్రబృందం ఎక్కడా రాజీ ప‌డ‌లేదు. ఇటీవల ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యాక్షన్ డోస్ కారణంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చినా? ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సీన్లను కట్ చేయడానికి దర్శకుడు నెల్సన్ ఒప్పుకోలేదని తెలిసింది. అనుకున్న విజన్‌ను, రా యాక్షన్‌ను ఉన్నది ఉన్నట్లుగానే థియేటర్లలోకి తీసుకురావాలనే వారి తెగింపే సినిమాపై వారికున్న అపరిమితమైన నమ్మకాన్ని చాటిచెబుతోంది.

ఈ ఆత్మవిశ్వాసం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగుతో పాటు ఇతర పాన్-ఇండియా మార్కెట్లలోనూ స్పష్టంగా ప్రతి ఫలిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఇతర క్రేజీ చిత్రాల నుంచి పోటీ ఉన్నా? విడుదల తేదీ విషయంలో గానీ, ప్రమోషన్లలో గానీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పంపిణీదారులు కూడా రజినీ-నెల్సన్ మ్యాజిక్ పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మొదటి భాగం రాబట్టిన వసూళ్లను మించి సీక్వెల్ రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ముగింపుగా చెప్పాలంటే కోలీవుడ్ లో నాటుకుపోయిన పార్ట్-2 ఫెయిల్యూర్ సెంటిమెంట్ నుఎ తిరగరాసేందుకు `జైలర్ 2` పూర్తి సన్నద్ధతతో ఉంది. పక్కా కథనం, రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, నెల్సన్ టేకింగ్ కలగలిసి చిత్రాన్ని మరో మైలురాయిగా నిలుపుతాయని అంచ‌నాలున్నాయి.