జైలర్ 2 : ఆయన్ని దాచి తప్పు చేశారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ 2 సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 12 Oct 2026 10:00 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ 2 సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా విడుదల సమయంలో మరింతగా అంచనాలు పెంచుతుందని అంతా భావించారు. కానీ రజనీకాంత్ గత చిత్రాల బజ్‌తో పోల్చితే ఈ సినిమాకు వచ్చిన బజ్ తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాను భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మించాడు. సినిమా పబ్లిసిటీ విషయంలో సన్ పిక్చర్స్ వారు భారీగా ఖర్చు చేస్తారు. కానీ కొన్ని నిర్ణయాల కారణంగా సినిమా ఆశించిన స్థాయిలో బజ్ ను దక్కించుకోలేక పోయింది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సినిమాలో కావాల్సినంత మంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ట్రైలర్‌లో అందరినీ ప్రాపర్‌గా చూపించలేదు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
హృతిక్ రోషన్ ఉన్నాడా? లేడా?
ముఖ్యంగా సినిమాలో హృతిక్ రోషన్ ఉన్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆయన్ను ట్రైలర్ లో చూపించక పోవడం వల్ల అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉన్నాడా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. జైలర్ కి సీక్వెల్ అనే ట్యాగ్ ఉండటం వల్ల జైలర్ 2 కి మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతూ వచ్చింది. మొదటి నుంచి ఉన్న బజ్ ను విడుదల సమయంకు డబుల్, ట్రిపుల్ చేసినట్లయితే భారీ ఓపెనింగ్స్ కు ఛాన్స్ ఉంటుంది. అయితే మేకర్స్ పెద్దగా కష్టపడకుండా సినిమాను ఒక మోస్తరుగానే ప్రమోట్ చేయడం వల్ల బజ్ పెరగలేదు. కానీ చిత్ర యూనిట్ సభ్యుల అంచనా ప్రకారం సినిమా విడుదలైన తర్వాత వచ్చే పాజిటివ్ పబ్లిసిటీ కారణంగా కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అవుతాయట. అంతే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో జైలర్ 2 ఓపెనింగ్ వసూళ్లతో సత్తా చాటుతుందని అంటున్నారు.
జైలర్ 2 సినిమా దర్శకుడు...
హృతిక్ రోషన్ ను ట్రైలర్ లో చూపించని కారణంగా బాలీవుడ్‌లో సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. హిందీ ప్రేక్షకుల్లో జైలర్ 2 సినిమా చూడాలనే ఆసక్తి పెద్దగా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. హృతిక్ రోషన్ ను ట్రైలర్ లో చూపించినట్లయితే తప్పకుండా హిందీ ప్రేక్షకులు హృతిక్ కోసం అయినా కచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకుని ఉండేవారు కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హృతిక్ గెస్ట్ అప్పియరెన్స్ ను మొదటి నుంచి సస్పెన్స్ గా ఉంచాలని దర్శకుడు నెల్సన్ దిలీప్ భావించాడట. అందుకే ఆయన్ను ట్రైలర్ లో చూపించలేదని యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే సినీ విశ్లేషకులు మాత్రం సినిమాలో ఆయన ప్రజెన్స్ గురించి సస్పెన్స్ గా ఉంచితే ఏం ప్రయోజనం అంటున్నారు. సినిమాకు బజ్ క్రియేట్ కావాలంటే అలాంటి విషయాలను రివీల్ చేయాల్సిందే కదా, దాచడం వల్ల ప్రయోజనం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
టాలీవుడ్‌లో సితార రిలీజ్...
రజనీకాంత్ చాలా గ్యాప్ తర్వాత జైలర్‌తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వరుసగా నిరుత్సాహ పరుస్తూ వస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా రజనీకాంత్ ఆకట్టుకుంటాడా అనేది చూడాలి. నెల్సన్ దిలీప్ ఈ సినిమాను భారీ స్టార్ కాస్ట్‌తో రూపొందించాడు. ఈ సినిమాలో ఎక్కువ మంది స్టార్స్ అయ్యారు అనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంత మందికి దర్శకుడు నెల్సన్ దిలీప్ సరైన స్క్రీన్ ప్రజెన్స్, స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటాడా అనే చర్చ ప్రముఖంగా జరుగుతోంది. మొత్తానికి భారీ అంచనాల నడుమ రూపొందిన జైలర్ 2 సినిమా విడుదల సమయంలో ఉండాల్సిన హంగామా అయితే కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార వారు పంపిణీ చేయడం కలిసి వచ్చే అంశం. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు జైలర్ 2 పై ఆసక్తి కనబర్చుతున్నారు. తప్పకుండా టాలీవుడ్‌లో మంచి విజయాన్ని ఈ సినిమా దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర భాషల విషయమై విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
