ప్రిక్వెల్, సీక్వెల్స్ కలయికగా మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ముత్తువేల్ జైలర్‌గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించనున్నాయట.
By: Srikanth Kontham | 17 May 2026 12:04 PM ISTసూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `జైలర్` చిత్రానికి సీక్వెల్ గా `జైలర్2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తోన్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై సోషల్ మీడియాలో తాజాగా ఓ సంచలన లీక్ చక్కర్లు కొడుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్‌ను( రజనీకాంత్) వెండితెరపై మునుపెన్నడూ చూడని విధంగా? అత్యంత భారీ స్థాయిలో రీ-ఇంట్రడ్యూస్ చేయడానికి నెల్సన్ మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లే ఐడియాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ముత్తువేల్ పాండి యన్ రిటైర్మెంట్‌కు ముందు ఉన్న జీవితాన్ని చూపిస్తూ ఓ పవర్‌ఫుల్ ప్రిక్వెల్ లా సాగుతుందట.
ముత్తువేల్ జైలర్‌గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించనున్నాయట. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే? మొదటి భాగం ఎక్కడ ముగిసిందో? దానికి కొనసాగింపుగా పూర్తి స్థాయి సీక్వెల్ రన్‌తో నడుస్తుందని టాక్. ఒకే సినిమాలో ప్రిక్వెల్, సీక్వెల్ రెండింటినీ బ్లెండ్ చేయాలనే నెల్సన్ ఆలోచన సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తుంది. సౌత్ ఇండస్ట్రీలో వర్సటైల్ విలనిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఎస్.జె. సూర్య సినిమాలో ప్రధాన విలన్‌గా నటిస్తుండటం విశేషం.
రజనీకాంత్ స్వాగ్‌కు, ఎస్.జె. సూర్య విలక్షణమైన యాక్టింగ్‌కు మధ్య జరిగే మైండ్ గేమ్స్ వెండి తెరపై అల్టిమేట్ మాస్ ఫీస్ట్‌లా ఉండబోతున్నాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ లతో పాటు.. ఈసారి సీక్వెల్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ప్రత్యేకమైన అతిథి పాత్రలో అలరించనున్నారు. ముగ్గురు అగ్ర నటుల స్క్రీన్ ప్రెజెన్స్ - ఎలివేషన్ సీన్లు సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజికల్ ఎటాకింగ్ ఏమాత్రం తగ్గదు. ఫస్ట్ పార్ట్‌లో హుకుమ్ పాటతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అనిరుద్ `జైలర్ 2` కోసం మరింత ఎక్స్‌ప్లోజివ్ మ్యూజిక్ ఊచకోత కోసే రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. అనిరుధ్ మ్యూజిక్- నెల్సన్ లార్జర్-ద్యాన్-లైఫ్ టేకింగ్ తోడైతే థియేటర్లు రీసౌండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకాలం రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందకు తీసుకు రావడానికి సిద్దం చేస్తున్నారు.
