Begin typing your search above and press return to search.

క‌లెక్షన్ల వర్షం కురుస్తున్నా..స్టార్ కాస్టింగ్ విషయంలో అసంతృప్తి!

తొలి షాట్ లో మోహన్‌లాల్ పాత్ర సీన్‌ను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడంతో ఆరోల్ కంటున్యూటీ ఇంకా ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంద‌ని భావించారు.

By:  Srikanth Kontham   |   20 Oct 2026 1:23 PM IST
క‌లెక్షన్ల వర్షం కురుస్తున్నా..స్టార్ కాస్టింగ్ విషయంలో అసంతృప్తి!
X

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన భారీ సీక్వెల్ `జైలర్ 2` బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నా? ప్రేక్ష‌కాభిమానుల‌ నుంచి ఓ విమర్శ గట్టిగా వినిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్ హృతిక్ రోషన్ లాంటి దిగ్గజ న‌టులు సినిమాలో ఉన్నా? వారికి కేటాయించిన స్క్రీన్ టైమ్ స్వల్పంగా ఉండటం సగటు సినిమా ప్రేమికులను.. ముఖ్యంగా వారి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.

తొలి షాట్ లో మోహన్‌లాల్ పాత్ర సీన్‌ను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడంతో ఆరోల్ కంటున్యూటీ ఇంకా ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంద‌ని భావించారు. కానీ అక్క‌డ సీన్ రివ‌ర్స్ అయింది. ఆ త‌ర్వాత కాసేప‌టికి హృతిక్ రోషన్ చేరడం తో అంచనాలు మ‌ళ్లీ పీక్స్ కు వెళ్లాయి. అయితే సినిమాలో హృతిక్ పాత్ర కూడా కొన్ని నిమిషాలకే పరిమితం అయింది. మోహన్‌లాల్ క్యారెక్టర్ కూడా సరిగ్గా ఎలివేట్ అవ్వకముందే ముగిసిపోతుంది. దీంతో అంతటి స్టార్ పవర్ ఉన్న నటులను ప్రమోషన్ల కోసం, హైప్ పెంచడానికే వాడుకున్నారనే భావన ప్రేక్షకుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

కథా పరంగా చూస్తే నెల్సన్ దిలీప్‌కుమార్ పూర్తి దృష్టిని రజినీకాంత్ క్యారెక్టర్ డ్రైవ్ పైనే ఉంచారు. ఒక సీక్వెల్‌ను రన్ చేస్తున్నప్పుడు ప్రధాన కథాంశం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఇతర స్టార్ల పాత్రలను పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. పెద్ద స్టార్లను ఎక్కువుగా చొప్పించి స్క్రీన్ టైమ్ పెంచితే.. అసలు కథ ట్రాక్ తప్పుతుందనే భయం దర్శకుడికి ఉండి ఉండొచ్చు.

అయితే విజన్ పరంగా దర్శకుడు జాగ్రత్త ప‌డినా? క్రాఫ్ట్ పరంగా మాత్రం ఆయన పూర్తిగా సక్సెస్ కాలేదనే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. మోహన్‌లాల్, హృతిక్ వంటి పాన్-ఇండియా ఇమేజ్ ఉన్న నటులు స్క్రీన్ పైకి వచ్చినప్పుడు థియేటర్లలో ఇచ్చే హైప్ వేరే స్థాయిలో ఉంటుంది. అంతటి పొటెన్షియల్ ఉన్న పాత్రలకు బలమైన సన్నివేశాలు.. ఎలివేషన్లు రాయడంలో నెల్సన్ త‌డ‌బ‌డిన‌ట్లు క‌నిపిస్తుంది.

రచయితగా నెల్సన్ ఈ విషయంలో కొంత విఫ‌ల‌మైనా? ప్రాజెక్ట్ వాణిజ్య పరమైన బిజినెస్ తెచ్చుకోవడంలో.. ఓపెనింగ్స్ సాధించడంలో కాస్టింగ్ వ్యూహం బాగా పని చేసిందన్న‌ది కాద‌న‌లేని నిజం. ఆ రకంగా ప్రొడక్షన్ పరంగా సక్సెస్ అయినట్లే అనిపించినా? సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పరంగా చూస్తే మాత్రం ప్రేక్షకులకు అరకొర అనుభూతినే మిగిల్చారనే మాట వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈసినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఐదు రోజుల్లోనే 450 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. పోటీగా మ‌రే సినిమా కూడా లేక‌పోవ‌డంతో `జైల‌ర్ 2` దూకుడు ఇప్ప‌ట్లో ఆప‌డం అసాధ్యం. అయితే 1000 కోట్ల టార్గెట్ ను రీచ్ అవుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.