Begin typing your search above and press return to search.

మిథున్ చక్రవర్తి విచిత్ర కండిషన్ల వెనుక జైలర్ 2 ప్లాన్ ఇదేనా!

రజనీకాంత్ విషయానికి వస్తే సూప‌ర్ స్టార్ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది దిగ్గజ నటులతో కలిసి పనిచేశారు.

By:  Srikanth Kontham   |   14 Oct 2026 12:22 PM IST
మిథున్ చక్రవర్తి విచిత్ర కండిషన్ల వెనుక జైలర్ 2 ప్లాన్ ఇదేనా!
X

1000 కోట్ల వ‌సూళ్ల టార్గెట్ తో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `జైల‌ర్ 2` రిలీజ్ కు రెడీ అవుతోంది.సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ప్రాజెక్ట్ మొద‌లైన నాటి నుంచి నేటి వ‌ర‌కూ హైప్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. స్టోరీ ద‌గ్గ‌ర నుంచి పాత్ర‌ల వ‌ర‌కూ ప్ర‌తీది ఎగ్జైట్ మెంట్ ను తీసుకొచ్చింది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మిథున్ పాత్రకు సంబంధించి ఆయన పెట్టిన కొన్ని విచిత్రమైన నిబంధనలు హాట్ టాపిక్‌గా మారాయి.

మిథున్ పాత్రను కొట్టకూడదని, తిట్టకూడదని, చివరకు తుపాకీతో కాల్చి చంపే సీన్స్ కూడా ఉండకూడదని కండిషన్లు పెట్టారు. ఈ షరతులకు ఒప్పుకున్నాకే ఆయన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రత్యామ్యాయంగా లేదా కీలక పాత్ర పోషిస్తున్న నటుడి నుంచి ఇలాంటి నిబంధనలు వస్తే రజనీకాంత్ .. నెల్సన్ ఎలా? ఆలోచించి ఉంటారనే కోణంలో ఆసక్తికరంగా మారింది.

ఇలాంటి కండిషన్ విన్న వెంటనే నెల్సన్ దిలీప్‌కుమార్ తనదైన శైలిలో ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఎందుకంటే? నెల్సన్ సినిమాల్లో వైలెన్స్, డార్క్ హ్యూమర్, పవర్ ఫుల్ ఎలివేషన్లు ప్రధాన బలం. ముఖ్యంగా విలన్లు .. ప్రత్యర్థులపై హీరో చేసే విధ్వంసం ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ ఇస్తుంది. అలాంటిది ప్రముఖ పాత్రపై ఎలాంటి భౌతిక దాడులు, హింసాత్మక దృశ్యాలు ఉండకూడదంటే? నెల్సన్ స్క్రీన్ ప్లే శైలిని ఆ పాత్ర విషయంలో పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. సాధారణంగా యాక్షన్ జోనర్‌లో ఇది పెద్ద సవాలే అయినా? ఒక సీనియర్ నటుడి స్థాయిని గౌరవిస్తూ కథలో ఆ పాత్రకు ఉండే ప్రత్యేక ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఉంటారు.

రజనీకాంత్ విషయానికి వస్తే సూప‌ర్ స్టార్ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది దిగ్గజ నటులతో కలిసి పనిచేశారు. మిథున్ చక్రవర్తి వంటి సీనియర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడి అనుభవాన్ని, ఆయన కోరుకునే హుందాతనాన్ని రజనీ పూర్తిగా గౌరవిస్తారనడంలో సందేహం లేదు. తెరపై సహచర నటుడికి దక్కాల్సిన గౌరవం, ఇమేజ్ దెబ్బతి నకుండా ఉండే జాగ్రత్తలను రజనీ సానుకూలంగానే స్వీకరించి ఉంటారు. సూపర్‌స్టార్‌గా ఎదురులేక‌పో యినా? సహనటుడి ప్రాధాన్యతను గుర్తించే ఆయన సంస్కారానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

ఈ కండిషన్ల వెనుక నిబంధనలే కాకుండా ఆ పాత్ర స్వభావంపై కూడా స్పష్టత ఉండే అవకాశం ఉంది. జైలర్ చిత్రంలో విలనిజం .. పాత్రల చిత్రణ కొట్టుకోవడం, చంపుకోవడం మాత్రమే కాదు. మైండ్ గేమ్స్, మాటల తూటాలు, పవర్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంటుంది. మిథున్ చక్రవర్తి పాత్రను హింసాత్మక మార్గంలో కాకుండా.. కేవలం తన మేధస్సు, ఆధిపత్యం , గంభీరమైన అభినయంతో ఎలివేట్ చేసే అవకాశం ఉంది. దర్శకుడు నెల్సన్ ఈ పాత్రను భౌతిక పోరాటాలకు అతీతంగా మాఫియా గాడ్‌ఫాదర్ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా డిజైన్ చేసి ఉంటారని భావించవచ్చు.

ఇలాంటి హద్దులు ఉండటం వల్ల సినిమాలో యాక్షన్ డోస్ తగ్గుతుందనే ఆందోళన కంటే? స్క్రీన్‌ప్లే మరింత సృజనాత్మకంగా మారుతుందనే అభిప్రాయానికి యూనిట్ రావొచ్చు. ఒక నటుడికి కేటాయించిన హద్దుల లోపలే ఉంటూ ఆ పాత్రకు తగినంత ప్రాధాన్య‌త క్రియేట్ చేయడం దర్శకుడి ప్రతిభకు పరీక్ష. నెల్సన్ తనదైన బ్లాక్ కామెడీ, సటైరికల్ డైలాగ్స్ ద్వారా మిథున్ పాత్రను హింస లేకుండానే పవర్‌ఫుల్‌గా ప్ర‌జెంట్ చేసే ప్లాన్ తో డిజైన్ చేయోచ్చు.