జైలర్ 2 లో అతను ఉన్నాడా? ఆ షాడో ఎవరిది?
సన్ పిక్చర్స్ బ్యానర్‌లో నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన 'జైలర్ 2' సినిమాకు అనిరుధ్ ఇచ్చిన సంగీతం కచ్చితంగా ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
By: Ramesh Palla | 7 Oct 2026 11:46 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ 'జైలర్' కి సీక్వెల్‌గా రూపొందిన 'జైలర్ 2' విడుదలకు సిద్ధం అయింది. దసరా కానుకగా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున విడుదలకు రెడీ అయింది. అక్టోబర్ 15, 2026న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా కేవలం రజనీకాంత్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జైలర్ లో కేవలం శివన్న నటిస్తే అంచనాలు పీక్స్‌కి చేరిన విషయం తెల్సిందే. ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ శివన్న మాత్రమే కాకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం జైలర్ 2 లో కనిపించబోతున్నాడు. జైలర్ 2 ట్రైలర్ విడుదల తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. టాలీవుడ్ ప్రేక్షకులు, హిందీ ప్రేక్షకులు సైతం జైలర్ 2 ను థియేటర్‌లో ఎప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రజనీకాంత్ జైలర్ 2 లో...
గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లుగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌లు సినిమాలో కనిపించబోతున్నారు. ఇక సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య సైతం కనిపించబోతున్నాడు. ఇంకా బాలీవుడ్ నటి విద్యా బాలన్ సైతం సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు నెల్సన్ దిలీప్ జైలర్ 2 ను రూపొందించాడని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కనిపించబోతున్నాడు, ఆయన గెస్ట్ అప్పియరెన్స్‌కి బాలీవుడ్ ప్రేక్షకులు సర్‌ప్రైజ్ కావడం ఖాయం అని చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతూ వస్తున్నారు. ఫైనల్‌గా ట్రైలర్ వచ్చింది, ట్రైలర్‌లో శివన్న, మోహన్ లాల్‌లు కనిపించారు కానీ హృతిక్ ఎక్కడ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
శివరాజ్ కుమార్, మోహన్ లాల్...
ఇదే సమయంలో ట్రైలర్‌లో ఒకానొక షాట్ లో హృతిక్ రోషన్ ను డార్క్ షాడోలో చూపించారని, ఆ డార్క్ షేడ్‌లో కనిపించిన క్యారెక్టర్ కచ్చితంగా హృతిక్ రోషన్ అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్ లో ఉన్న ఆ సీక్రెట్ ను కొందరు డీ కోడ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొందరు ఆ డార్క్ షేడ్ లో ఉన్న క్యారెక్టర్ హృతిక్ రోషన్ అని కనిపెడుతున్నారు. మొత్తానికి జైలర్ 2 లో హృతిక్ రోషన్ ఉన్నాడా లేదా అనే విషయంలో యూనిట్ సభ్యుల నుంచి స్పష్టత రాలేదు, వారు ఆ సస్పెన్స్ ను సినిమా విడుదల వరకు కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రేక్షకులు, నెటిజన్స్ మాత్రం సినిమాలో కచ్చితంగా హృతిక్ రోషన్ ఉన్నాడు అంటూ గట్టిగా చెబుతున్నారు. ఆ డార్క్ షాడో తో కనిపించింది మరెవ్వరో కాదు హృతిక్ రోషన్ అంటూ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
జైలర్ 2 లో హృతిక్ రోషన్...
సన్ పిక్చర్స్ బ్యానర్‌లో నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన 'జైలర్ 2' సినిమాకు అనిరుధ్ ఇచ్చిన సంగీతం కచ్చితంగా ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్య కాలంలో అనిరుధ్ నుంచి వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. పైగా జైలర్ సంగీతం ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. ఇప్పటికీ ఆ మ్యూజిక్ టీవీలో, సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. కనుక జైలర్ 2 విడుదల తర్వాత కూడా మ్యూజిక్ గురించి ప్రముఖంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతున్నారు. హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఉన్నట్లుగా ముందుగా ప్రకటిస్తే బాలీవుడ్‌లో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ యూనిట్ సభ్యులు మాత్రం ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారు. విడుదలకు ఒకటి లేదా రెండు రోజుల ముందు అయినా జైలర్ 2 లో ఆయన ఉన్నాడని, ఆ షాడో హృతిక్ ది అని యూనిట్ సభ్యులు ప్రకటిస్తారేమో చూడాలి.
