Begin typing your search above and press return to search.

జైలర్‌ 2 : సోషల్‌ మీడియా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌..!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వంలో రూపొందిన 'జైలర్‌ 2' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Ramesh Palla   |   16 Oct 2026 9:05 AM IST
జైలర్‌ 2 : సోషల్‌ మీడియా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌..!
X

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వంలో రూపొందిన 'జైలర్‌ 2' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్‌ హాఫ్‌ మంచి కామెడీతో దర్శకుడు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అంటూ రివ్యూలు వస్తున్నాయి. రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ తో పాటు ప్రేక్షకులు సినిమాను చూసేందుకు థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. రివ్యూలను పట్టించుకోకుండా ప్రేక్షకులు జైలర్‌ 2 ను చూస్తున్నట్లుగా నమోదు అవుతున్న కలెక్షన్స్‌ను బట్టి అర్థం అవుతుంది. తమిళనాడులో సినిమా రికార్డ్‌ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కించుకుంటుందని మొదటి నుంచి అంటున్నారు. సినిమాకు వస్తున్న వసూళ్లు చూస్తూ ఉంటే అది నిజం కాబోతుందేమో అనిపిస్తుంది. సినిమా పూర్తి ఫలితం రావాలంటే మరో మూడు నాలుగు రోజులు వెయిట్‌ చేయాల్సిందే. అయితే ఈ సమయంలో సినిమా గురించి సోషల్ మీడియాలో ఔత్సాహిక ప్రేక్షకులు కొందరు తమ అభిప్రాయంను షేర్‌ చేస్తున్నారు.

జైలర్‌లో శివరాజ్ కుమార్‌ పాత్ర....

సినిమా విడుదల కాగానే రివ్యూలు రావడం కామన్‌, అదే విధంగా సోషల్‌ మీడియాలో కామనర్స్ తమ అభిప్రాయాలను షేర్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. రివ్యూల్లో బాగా లేదని చెప్పిన సినిమా గురించి కొందరు ప్రేక్షకులు పాజిటివ్‌గా, పాజిటివ్‌ రివ్యూలు వచ్చిన సినిమాలకు నెగిటివ్‌గా స్పందించడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే జైలర్‌ 2 సినిమా విషయంలో ఎక్కువగా క్యామియో క్యారెక్టర్స్‌ గురించి ప్రేక్షకులు స్పందిస్తున్నారు. జైలర్‌ మొదటి పార్ట్‌ లో శివ రాజ్‌ కుమార్‌ చేసిన పాత్ర గురించి ఏ స్థాయిలో చర్చ జరిగిందో మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో శివన్న, మోహన్‌ లాల్‌, హృతిక్ రోషన్‌ ల క్యామియో గురించి చర్చ జరుగుతోంది. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా హృతిక్ నిలవడం జరిగింది. స్క్రీన్‌ ప్లే కీలక సమయంలో హృతిక్‌ రోషన్‌ ప్రజెన్స్ అందరిని ఆకట్టుకుంది. అదే విషయం చాలా మంది సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు.

రజనీకాంత్‌ జైలర్‌ 2 లో గెస్ట్‌ రోల్స్‌...

సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి హృతిక్‌ రోషన్‌ స్క్రీన్‌ పై ఎప్పుడు కనిపిస్తాడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన మరీ ఆలస్యంగా వచ్చాడని ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో హృతిక్‌ రోషన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ టైం గురించి కూడ ఆ ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఎంతో ఆసక్తిగా, సినిమా ఆరంభం నుంచి ఎదురు చూసిన పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లి పోతే కచ్చితంగా ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉంటుంది. సోషల్‌ మీడియాలో సినిమాను చూసిన వారు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ కోసం చాలా సమయం ఎదురు చూశాం. ఆయన వచ్చాడు అని సంతోషించే లోపు వెళ్లి పోయాడు అంటూ కొన్ని మీమ్స్ ను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో హృతిక్ అభిమానులు, సినిమా చూసిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జైలర్‌ 2 లో హృతిక్ రోషన్‌ పాత్ర...

హృతిక్‌ పాత్ర విషయంలో సోషల్‌ మీడియాలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్క్రీన్‌ ప్రజెన్స్ బాగుంది, కీలక సమయంలో రావడం బాగుంది కానీ, కాస్త ఎక్కువ సమయం ఉంటే బాగుండేది కదా అంటున్నారు. కనీసం 10 నిమిషాలు అయినా హృతిక్‌ ఉండి ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాలో చాలా భారీ స్టార్‌ కాస్ట్‌ ఉన్న విషయం తెల్సిందే. వారందరికీ ప్రాధాన్యత ఇవ్వాలన్నా, కనీసం స్క్రీన్‌ ప్రజెన్స్ దక్కాలన్నా హృతిక్‌ రోషన్‌ పాత్ర నిడివి తగ్గించాల్సిందే అని దర్శకుడు నెల్సన్‌ భావించి ఉంటాడు. అందుకే చాలా తక్కువ నిడివితోనే హృతిక్ రోషన్‌ పాత్రను డిజైన్‌ చేసినట్లుగా అంతా భావిస్తున్నారు. మొత్తానికి జైలర్‌ 2 లో హృతిక్ రోషన్ ఉన్నాడు. ఆయన స్క్రీన్‌ ప్రజెన్స్‌ తో సినిమా స్థాయిని పెంచాడు అని ఫ్యాన్స్ కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జైలర్‌ 2 భారీ స్టార్‌ కాస్ట్‌తో కన్నుల విందుగా ఉందని అంటున్న వారు చాలా మంది ఉన్నారు.