Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ-హృతిక్ రేర్ కాంబినేష‌న్ సెట్ట‌యిందా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ `జైలర్ 2`పై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.

By:  Sivaji Kontham   |   28 May 2026 10:44 AM IST
ర‌జ‌నీ-హృతిక్ రేర్ కాంబినేష‌న్ సెట్ట‌యిందా?
X

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ `జైలర్ 2`పై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యామియో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త‌మిళ మీడియా క‌థ‌నం ప్రకారం.. తొలుత ఈ ప్రత్యేక పాత్ర కోసం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను సంప్రదించగా ఆయన తన తాజా చిత్రం `కింగ్` షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో మేకర్స్ ఇప్పుడు హృతిక్ రోషన్‌ను రంగంలోకి దించేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మొదటి భాగంలో ముత్తువేల్ పాండియన్ ప్రయాణం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే `జైలర్ 2` కథాంశం కొనసాగుతుందని సమాచారం. ఈ క్రేజీ సీక్వెల్‌లో రజనీకాంత్‌తో పాటు మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్‌.జె. సూర్య, సూరజ్ వెంజారమూడు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా పార్ట్-1లో తమ క్యామియోలతో థియేటర్లలో పూనకాలు తెప్పించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ఈ సీక్వెల్‌లో తమ పాత్రలను రిపీట్ చేయబోతున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో 11 సెప్టెంబర్ 2026న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రజనీకాంత్ తన తదుపరి చిత్రాల లైనప్‌తో ఎంతో బిజీగా ఉన్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ `రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్` బ్యానర్‌పై తెర‌కెక్క‌నున్న `తలైవర్ 173` ప్రాజెక్ట్‌లో ఆయన నటించనున్నారు. తొలుత ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగినా.. అత‌డు తప్పుకోవడంతో సిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం... సిబి చక్రవర్తి కూడా ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగే అవకాశం ఉందని..`డ్రాగన్` ఫేమ్ అశ్వత్ మరిముత్తు సరికొత్త కథాంశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించవచ్చని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే రజనీకాంత్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ KHxRK రీయూనియన్ కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఒకవైపు హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో చర్చలు.. మరోవైపు కమల్ హాసన్ లాంటి దిగ్గజాలతో క్రేజీ కాంబినేషన్స్ తో థలైవా ర‌జ‌నీకాంత్ లైనప్ చూస్తుంటే మునుముందు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ర‌జ‌నీకాంత్- హృతిక్ రోష‌న్, ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్ హాస‌న్ క‌ల‌యిక‌లో మ‌ల్టీస్టార‌ర్లు వ‌స్తున్నాయంటే దేశ‌వ్యాప్తంగా ఈ కాంబినేష‌న్ల‌పై ఆస‌క్తి నెల‌కొంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ర‌జ‌నీకాంత్ - చిరంజీవి, ర‌జ‌నీకాంత్ - అమితాబ్ రేర్ కాంబినేష‌న్ల త‌ర్వాత ఈ స్పెష‌ల్ కాంబినేష‌న్లు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతున్నాయి.