Begin typing your search above and press return to search.

నార్త్‌ లో అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా..

సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ కు సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.

By:  M Prashanth   |   13 Oct 2026 4:30 PM IST
నార్త్‌ లో అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా..
X

సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ కు సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇదే క్రేజ్ నార్త్ లోనూ కనిపిస్తుందా? అనే ప్రశ్నకు జైలర్ ఫస్ట్ పార్ట్ ఆశించిన ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పుడు జైలర్ 2తో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మేకర్స్ చూస్తున్నారు. కానీ ఈసారి కూడా వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.

2023లో విడుదలైన జైలర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. రజినీ స్టైల్, యాక్షన్ సీన్స్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు స్ట్రెంత్ గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమా సౌత్ లో సంచలనం సృష్టించింది. కానీ హిందీ మార్కెట్‌ లో మాత్రం అదే రేంజ్ ఎఫెక్ట్ చూపించలేకపోయింది. దీనికి అప్పట్లో బాలీవుడ్‌ లో పోటీ కూడా ఒక కారణం.

జైలర్ విడుదలైన మరుసటి రోజే ‘గదర్ 2’, ఓ మై గాడ్ 2 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. దీంతో హిందీ ప్రేక్షకుల దృష్టి అటు వెళ్లింది. ఇప్పుడు ‘జైలర్ 2’ విషయంలో పరిస్థితులు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. మొదటి భాగంతో పోలిస్తే ఈసారి హిందీ మార్కెట్‌ లో పెద్ద సినిమాల పోటీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో రజి సినిమాకు నార్త్ లో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే పోటీ తక్కువగా ఉండటమే సక్సెస్ కు హామీ కాదు. సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయి, ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అన్నదే మెయిన్. రీసెంట్ గా ‘జైలర్ 2ను హిందీలో విడుదల చేయడం లేదంటూ ప్రచారం జరిగినా.. ఆ మూవీ హిందీ వెర్షన్‌ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్. కానీ ఓటీటీ డీల్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది!

సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కొంతకాలానికి ఓటీటీలోకి వస్తుంది. అయితే జైలర్ 2 విషయంలో నాలుగు వారాలకే ఓటీటీలోకి తీసుకురావాలన్న ఒప్పందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ నార్త్ లోని కొన్ని ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు హిందీ సినిమాలకు ఎనిమిది వారాల థియేటర్ సమయం ఉండాలని కోరుతున్నాయి. ఆ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

అదే జరిగితే హిందీ వసూళ్లపై ప్రభావం పడొచ్చు. అదే సమయంలో నార్త్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు పలువురు బీటౌన్ క్యాస్టింగ్ ను సినిమాలోకి తీసుకున్నారు మేకర్స్. కానీ స్టోరీ, రజినీ రోల్, ప్రమోషన్స్.. ఇవి మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. ఇక ఫస్ట్ పార్ట్ సౌత్ లో భారీ విజయాన్ని అందుకున్నా.. హిందీలో మాత్రం పరిమిత వసూళ్లకే ఆగిపోయింది. ఇప్పుడు రెండో భాగానికి అక్కడ పోటీ తగ్గినా, థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈసారి ఏం జరుగుతుందో అంతా వేచి చూడాలి.