Begin typing your search above and press return to search.

'జైలర్ 3'పై నెల్సన్ స్పీడ్ పెంచుతారా లేక గ్యాప్ తీసుకుంటారా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం `జైలర్` బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

By:  Srikanth Kontham   |   15 Oct 2026 9:31 PM IST
జైలర్ 3పై నెల్సన్ స్పీడ్ పెంచుతారా లేక గ్యాప్ తీసుకుంటారా?
X

సూపర్‌స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం `జైలర్` బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అఖండ విజయంతో రజనీ-నెల్సన్ కాంబినేషన్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. సరిగ్గా అదే అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన `జైలర్ 2` తొలి రోజునే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఏ రేంజ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తుందనేది చూడాలి. ఈనేప‌థ్యంలో `జైలర్ 3` గురించిన చర్చలు షురూ అయ్యాయి.

`జైలర్ 2` షూటింగ్ పూర్తి కావడానికి ముందే `జైలర్ 3` కోర్ ప్లాట్‌ను కూడా దర్శకుడు నెల్సన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వినిపించారు. అలాగే `జైలర్ 2` క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు, ట్విస్ట్‌లు మునుముందు రాబోయే మూడో భాగానికి లీడ్ ఇచ్చేలా డైరెక్టర్ వ్యూహాత్మకంగా డిజైన్ చేసారు. సినిమా చూసిన ఆడియన్స్‌కు కూడా ముగింపు దశలో ఈ ఫ్రాంచైజీకి ఇంకా కథ ఉందని అర్థమయ్యేలా నెల్సన్ మ్యాజిక్ చేశారు. మ‌రి జైల‌ర్ 3 కూడా హుటా హుటిన మొద‌లు పెడ‌తారా? లేదా? అన్న‌ది తేలాల్సిన అంశం.

మొదటి భాగం విడుదలైన వెంటనే నెల్సన్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా `జైలర్ 2` స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్‌పై ఎలా పడ్డారో? ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతారా లేక కాస్త విరామం తీసుకుంటారా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. గతంలో `జైలర్` సక్సెస్ ఇచ్చిన జోష్‌తో వెంటనే సీక్వెల్‌కు రంగంలోకి దిగిన నెల్సన్ ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించే అవకాశం ఉందనేది కొందరి వాదన. అయితే రెండు భారీ సినిమాల ఒత్తిడి నుంచి బయటపడి రజనీకాంత్ ఇతర ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే వరకు నెల్సన్ కొంత సమయం తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ వయస్సును.. ఆయన మార్కెట్ స్టామినాను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేస్తే `జైలర్ 3` అనేది కేవలం ఒక సినిమాగా కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో గ్యాంగ్‌స్టర్ యూనివర్స్ లాగా మారుతుందని అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నెల్సన్ తనదైన డార్క్ హ్యూమర్, స్టైలిష్ ఎలివేషన్లతో ఈ ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. ముత్తువేల్ పాండియన్ పాత్ర చుట్టూ అల్లే ఈ కథలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణే మూడో భాగానికి బలమైన పునాదిగా మారొచ్చు.

అయితే `జైలర్ 2` లాంగ్ రన్ కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి మార్కులు వేస్తాయి? తుది ఫలితం ఎలా ఉంటుందనే? దానిపైనే `జైలర్ 3` అధికారిక ప్రకటన ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా? ఒక కమర్షియల్ సక్సెస్ ఫ్రాంచైజీని ఎలా లీడ్ చేయాలనే విషయంలో నెల్సన్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే హ్యాట్రిక్ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలను కొట్టేయేలేం.