జైలర్ 2 కలెక్షన్స్.. ఎంతవరకు వచ్చాయంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ మరోసారి 'జైలర్ 2'తో కనిపిస్తోంది. ఆ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ జాక్ పాట్ కొట్టినట్లే కనిపిస్తోంది.
By: M Prashanth | 22 Oct 2026 11:51 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ మరోసారి 'జైలర్ 2'తో కనిపిస్తోంది. ఆ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ జాక్ పాట్ కొట్టినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ను వెనక్కి తెచ్చుకోవడానికి ఆ సినిమా ఎక్కువ సమయం తీసుకోలేదు. ఫస్ట్ పార్ట్ కంటే ఒక్కరోజు ముందుగానే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకున్నట్లు ఇప్పుడు తెలుస్తోంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఆ సీక్వెల్ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. రజనీకాంత్ మాస్ సీన్లు, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం, దసరా హాలీడేస్ కలిసిరావడం సినిమాకు ప్లస్ అయ్యాయి. దీంతో తెలుగు హక్కుల కోసం పెట్టిన మొత్తాన్ని వారం రోజుల్లోపే వెనక్కి తెచ్చుకోగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో 'జైలర్ 2' వసూళ్ల వివరాలు ఇవే!
నైజాం: రూ.18 కోట్లు
సీడెడ్: రూ.6.56 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.5.22 కోట్లు
గుంటూరు: రూ.3.02 కోట్లు
కృష్ణా: రూ.2.94 కోట్లు
తూర్పు గోదావరి: రూ.2.74 కోట్లు
పశ్చిమ గోదావరి: రూ.1.90 కోట్లు
నెల్లూరు: రూ.1.66 కోట్లు
మొత్తం ఏడు రోజుల షేర్: రూ.42.04 కోట్లు
తెలుగు రాష్ట్రాల రైట్స్ వాల్యూ: సుమారు రూ.42 కోట్లు
ఆ లెక్కల ప్రకారం, సినిమా మొదటి వారంలోనే ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రాబట్టేసింది. ముఖ్యంగా నైజాం ప్రాంతం నుంచి రూ.18 కోట్ల షేర్ రావడం గమనించాల్సిన విషయం. మొత్తం వసూళ్లలో ఆ ఏరియా పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా సినిమా మంచి వసూళ్లు సాధించడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈజీగా అందుకుందని చెప్పాలి.
అయితే నాగవంశీ.. ఫస్ట్ పార్టుతో పోలిస్తే రెండో భాగం హక్కుల కోసం ఎక్కువ మొత్తం పెట్టాల్సి వచ్చింది. అయినా వసూళ్లు వేగంగా రావడంతో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తగ్గింది. మొదటి జైలర్ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఏడు రోజులు తీసుకోగా, రెండో పార్టు ఆరు రోజుల్లోనే ఆ మార్కును అందుకున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే ఒక్కరోజు ముందుగానే పెట్టుబడి వెనక్కి వచ్చినట్టే!
ఇక బ్రేక్ ఈవెన్ సాధించడమే ఫైనల్ సక్సెస్ కాదు. సినిమా చివరి వరకు ఎంత వసూలు చేస్తుందనేదే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే అసలు లాభాన్ని డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్పీడ్ కంటిన్యూ అయితే జైలర్ 2 తెలుగు రాష్ట్రాల్లో రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు లాభాన్ని అందించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఫైనల్ కౌంట్ బట్టి ప్రాఫిట్ లెక్క మారుతుంది.
సాధారణంగా డబ్బింగ్ సినిమాలకు తెలుగు మార్కెట్ లో ఇంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టడం ఒక సవాలే. కానీ రజనీపై ఉన్న నమ్మకం, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నాగవంశీకి కలిసొచ్చాయి. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఎఫెక్ట్ ను రెండో పార్ట్ కూడా కంటిన్యూ చేస్తోంది. మరి తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకున్న ఆ మూవీ.. చివరికి ఎంత లాభాన్ని అందిస్తుందో చూడాలి.
