'జైలర్ 2' లో బాలయ్య ఉన్నట్లా? లేనట్లా?
ఈ విషయంపై బాలయ్య కూడా ఎక్కడా స్పందించలేదు. అయితే ఓ సందర్బంలో దర్శకుడు నెల్సన్ ని అడిగితే ఆయన కూడా సరైన వివరణ ఇవ్వలేదు.
By: Srikanth Kontham | 31 Oct 2025 5:00 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ 2` శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి సినిమాలో నటసింహ బాలకృష్ణ ఓ పవర్ పుల్ పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జైలర్ మొదటి భాగంలో కొనసాగిన కామియో పాత్రలతో పాటు అదనంగా బాలయ్య రోల్ కూడా ఉంటుందని ప్రచారం అంతకంతకు హీటెక్కుతోంది. మిగతా కామియోల కంటే బాలయ్య పాత్ర నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని చర్చ జోరుగా సాగుతోంది. కృష్ణదేవ్ అనే పాత్రలో కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.
అయితే బాలయ్య నటిస్తున్నారా? లేదా? అన్నది మాత్రం ఇంత వరకూ అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటున్నా? అధికారిక ధృవీకరణ లేకపోవడంతో ఆయన నటిస్తున్నారా? లేదా? అన్న ప్రచారం మొదలైంది. ఈ విషయంపై బాలయ్య కూడా ఎక్కడా స్పందించలేదు. అయితే ఓ సందర్బంలో దర్శకుడు నెల్సన్ ని అడిగితే ఆయన కూడా సరైన వివరణ ఇవ్వలేదు. కానీ భాగమైతే బాగుంటుందని తాము కూడా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ అధికారకంగా వివరణ లేకపోవడంతో సందేహాలకు తావిచ్చినట్లు అయింది.
అయితే మొదటి భాగంలో కామియో పాత్రలను కూడా నెల్సన్ రివీల్ చేయలేదు. మోహన్ లాల్, శివకుమార్, జాకీ ష్రాఫ్, ఉపేంద్ర పవర్ పుల్ పాత్రలు పోషించినా విషయాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు. ముత్తవేల్ పాండియన్ (రజనీకాంత్) కష్టకాలంలో ఉన్న సమయంలో అప్పటికప్పుడు తెరపైకి వచ్చిన పవర్ పుల్ పాత్రలవి. ఈ నేపథ్యంలో బాలయ్య పాత్ర విషయంలో కూడా నెల్సన్ అలాంటి సస్పెన్సే కొనసాగిస్తున్నారా? అన్నది మరో సందేహం. అయితే బాలయ్య సినిమాలో భాగమవుతున్నారని ముందే రివీల్ చేస్తే తెలుగు మార్కెట్ పరంగా భారీగా కలిసొస్తుంది.
సినిమాలో బాలయ్య నటిస్తున్నారనే విషయం తెలిస్తే బోలెడంత ప్రచారం దక్కుతుంది. ఓపెనింగ్స్ కు కలిసొస్తుంది. ఒకవేళ బాలయ్య ఎంట్రీ నిజమే అయితే నెల్సన్ చివరి నిమిషయంలో రివీల్ చేస్తారా? లేక నేరుగా సినిమా థియేటర్లోనే సర్ ప్రైజ్ చేస్తారా? అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
