Begin typing your search above and press return to search.

'జైల‌ర్ 2' టికెట్ ధ‌ర‌ల పెంపు.. వార‌మంతా 5 షోలు..

సూపర్‌స్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ `జైలర్ 2` అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Sivaji Kontham   |   9 Oct 2026 10:52 PM IST
జైల‌ర్ 2 టికెట్ ధ‌ర‌ల పెంపు.. వార‌మంతా 5 షోలు..
X

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన‌ క్రేజీ మూవీ `జైలర్ 2` అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను సితార నాగవంశీ భారీ ధరకు సొంతం చేసుకుని ఘనంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక దసరా పండుగ సీజన్ కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్సులలో రూ. 75 చొప్పున టికెట్ రేట్లు పెంచుతూ జీఓ జారీ చేసింది. అలాగే టికెట్ ధరల పెంపుతో పాటు వారమంతా రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా అనుమతి లభించింది. డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు ఈ జీఓను ముందే విడుదల చేశారు.

నెల్సన్ దర్శకత్వం వహించిన‌ ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించ‌గా సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇందులో రమ్యకృష్ణ, మీర్నా, యోగి బాబు తమ పాత పాత్రలనే రిపీట్ చేస్తుండగా.. ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంద‌మూడు, విద్యాబాలన్, అన్నా రాజన్, జతిన్ సర్నా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

11 అక్టోబ‌ర్ నుంచే బుకింగ్స్ మొద‌లు..

సూపర్‌స్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ `జైలర్ 2` అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అక్టోబర్ 11 ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా కేరళలో ఈ సినిమా తొలి షో ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుండటం విశేషం. రజనీకాంత్ సినిమాకు కేరళలో ఇలా ఎర్లీ మార్నింగ్ షోలు పడటం ఆయన స్టార్‌డమ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక కేరళ - కర్ణాటకలో శ్రీ గోకులం మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ చిత్రం కోసం సుమారు 4,000లకు పైగా షోలను ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ మరోసారి `టైగర్` ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ కథ కొనసాగుతుంది. రమ్యకృష్ణ, యోగి బాబు, మీర్నా తదితరులు తమ పాత పాత్రలను రిపీట్ చేస్తుండగా.. ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ వంటి ప్రముఖ తారాగణం కొత్తగా చేరారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యుఏ.. 16+ సర్టిఫికేట్ లభించగా, దీని రన్ టైమ్ 165 నిమిషాల 18 సెకండ్లుగా ఖరారైంది.