Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ మూవీ.. ఓ లీక్ ఇచ్చిన హీరో

రీసెంట్ గా తేజ సజ్జా ఆ సినిమా అప్డేట్ ఇచ్చిన సంగతి విదితమే. ప్రశాంత్ వర్మ, రిషబ్‌ శెట్టి ఇద్దరూ వారి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారని చెప్పారు.

By:  M Prashanth   |   26 Sept 2025 4:34 PM IST
ప్రశాంత్ వర్మ మూవీ.. ఓ లీక్ ఇచ్చిన హీరో
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హనుమాన్ మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. యువ నటుడు తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాను సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.

అప్పుడే హనుమాన్ ను సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని ప్రకటించారు. తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సినిమా వస్తుందని తెలిపారు. హనుమాన్ మూవీకి మించి వంద రెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని చెప్పడంతో ఇప్పటకే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.

విజువల్ వండర్ గా ఉండనున్న ఆ సినిమాలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో కనిపించనున్నారు. తేజ సజ్జా కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అప్పట్లో ప్రశాంత్ వర్మ చెప్పినా.. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతున్నారు ప్రశాంత్ వర్మ.

రీసెంట్ గా తేజ సజ్జా ఆ సినిమా అప్డేట్ ఇచ్చిన సంగతి విదితమే. ప్రశాంత్ వర్మ, రిషబ్‌ శెట్టి ఇద్దరూ వారి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారని చెప్పారు. వాళ్ల చేతిలోని చిత్రాలు అయిపోయాక జై హనుమాన్‌ పనులు స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఇప్పుడు రిషబ్ శెట్టి తన అప్ కమింగ్ మూవీ కాంతార ప్రీక్వెల్ ప్రమోషన్స్ లో మరో అప్డేట్ ఇచ్చారు.

కాంతార చాప్టర్-1 మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు రిషబ్. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో జై హనుమాన్ కోసం మాట్లాడారు. కాంతార: చాప్టర్ 1 విడుదలకు ముందు తాను ఏ సినిమాకు కమిట్ అవ్వాలనుకోలేదని చెప్పారు. కానీ ప్రశాంత్ వర్మ తనకు జై హనుమాన్ కథ చెప్పారని అన్నారు.

అది విన్న వెంటనే జై హనుమాన్‌ ప్రాజెక్టుకు సంతకం చేశానని, అద్భుతమైన స్క్రిప్ట్ అని తెలిపారు. కథ చాలా ఆసక్తికరంగా ఉండగా.. ఇప్పటికే ఫోటోషూట్ పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలో జై హనుమాన్ షూటింగ్ ప్రారంభించడానికి తేదీని నిర్ణయిస్తామని వెల్లడించారు. దీంతో మరికొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవ్వనున్నట్లు తెలుస్తోంది.