Begin typing your search above and press return to search.

బుచ్చిబాబుతో జగపతిబాబు బాండింగ్.. అప్పట్నుంచే మొదలైందా?

ఈ సందర్భంగా ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న జగపతిబాబు డైరెక్టర్ బుచ్చిబాబుతో తనకున్న పాత అనుబంధాన్ని, అలాగే ఈ సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు. అవేంటో చూద్దాం...

By:  Madhu Reddy   |   28 May 2026 12:51 PM IST
బుచ్చిబాబుతో జగపతిబాబు బాండింగ్.. అప్పట్నుంచే మొదలైందా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. జూన్ 4న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న జగపతిబాబు డైరెక్టర్ బుచ్చిబాబుతో తనకున్న పాత అనుబంధాన్ని, అలాగే ఈ సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు. అవేంటో చూద్దాం...

అప్పుడే చెప్పిన జగపతిబాబు:

బుచ్చిబాబు ఈ సినిమాతోనే జగపతిబాబుకు పరిచయం కాలేదు. వీరిద్దరి బాండింగ్ ఇప్పటిది కాదు. 'నాన్నకు ప్రేమతో' సినిమా టైమ్‌లోనే బుచ్చిబాబు టాలెంట్ ఏంటో జగపతిబాబు కనిపెట్టేశారు. "నువ్వు భవిష్యత్తులో ఒక గొప్ప డైరెక్టర్ అవుతావు బుచ్చి" అని ఆయన అప్పుడే చెప్పారు. ఇక జగపతిబాబు అన్నట్టే బుచ్చిబాబు ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు.

సుకుమార్, బుచ్చిబాబుల స్టైల్:

సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు.. తన గురువు లాగే స్క్రిప్ట్ విషయంలో చాలా పక్కాగా ఉంటారట.రంగస్థలంలో ‘ఫణీంద్ర భూపతి’ పాత్ర కోసం సుకుమార్ ఎక్కువగా కథ వివరించకుండా “బాగుంటుంది సార్, చేసేయండి” అన్నాడని, అలాగే ‘పెద్ది’లో అప్పలసూరి పాత్ర గురించి బూచి బాబు కూడా చాలా చక్కగా వివరించాడని జగపతి బాబు గుర్తుచేసుకున్నారు. ఇక పెద్ద డైరెక్టర్ల కళ్లలోనే వాళ్లకి ఏం కావాలో తెలిసిపోతుందని ఆయన అన్నారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ మ్యాజిక్:

ట్రైలర్‌లో అప్పలసూరి లుక్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ లుక్ వెనుక నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్ వర్క్ ఉంది. బుచ్చిబాబు ఆఫీస్‌లో ఫస్ట్ డే జరిగిన స్క్రీన్ టెస్ట్‌లోనే ఫస్ట్ వేసిన మేకప్, డ్రెస్ ఓకే అయిపోయాయట. ఆ గెటప్ వేసుకోగానే తనకే తెలియకుండా అప్పలసూరిలా మారిపోయానని జగపతిబాబు చెప్పారు.

ఆ ఆరు సినిమాల్లో 'పెద్ది' టాప్:

జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక దాదాపు 80 నుంచి 90 సినిమాలు చేశారు. కానీ అందులో తనకు బాగా గుర్తిండిపోయేవి కేవలం ఆరు సినిమాలు మాత్రమేనని చెప్పారు. లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత.. ఈ లిస్టులో ఉన్నాయి. అయితే ఇప్పుడు రాబోతున్న 'పెద్ది' సినిమా క్యారెక్టర్ వాటన్నింటినీ మించి ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీ ప్రస్తుతం సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న టైమ్‌లో 'పెద్ది' సినిమా థియేటర్లకు ఒక పెద్ద రిలీఫ్ ఇవ్వబోతుందని జగపతిబాబు నమ్మకంగా చెప్తున్నారు. ఈ సినిమాతో అటు కొత్త నిర్మాతలకు నమ్మకం, ఇటు ప్రేక్షకులకు కావాల్సిన వినోదం ఖచ్చితంగా దొరుకుతుందని ఆశిద్దాం!