Begin typing your search above and press return to search.

'పెద్ది' తో కొత్త యాంగిల్ బ‌య‌ట‌కొస్తుందా?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `పెద్ది` పై అంచనాలుఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   12 May 2026 6:32 PM IST
పెద్ది తో కొత్త యాంగిల్ బ‌య‌ట‌కొస్తుందా?
X

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `పెద్ది` పై అంచనాలుఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా సినిమాలోని పాత్రల గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వస్తోంది. సీనియర్ నటుడు జగపతి బాబు పోషించిన అప్పాల సూరి పాత్ర సినిమాకు ఆయువుపట్టు అని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఒకే రకమైన విలన్ పాత్రలతో బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ సినిమాలో జగ్గుభాయ్ సరికొత్త అనుభూతిని అందించబోతున్నారుట‌.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం సినిమాలో జగపతి బాబు పాత్ర అత్యంత ఎమోషనల్‌గా ఉండబోతోందిట‌. `రంగస్థలం`లో క్రూరమైన ప్రెసిడెంట్‌గా మెప్పించిన ఆయన ఈసారి రామ్ చరణ్‌కు తండ్రిగా ఓ అద్భుతమైన నటనను కనబ రిచారట. మొదటి భాగంలో అప్పాల సూరి క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందని హీరో `పెద్ది` పాత్రను ముందుకు నడిపించే ఇంధనంలా పాత్ర సాగుతుంద‌ని సమాచారం. జగపతి బాబు కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ఈ పాత్రకు గానూ అవార్డు రావడం ఖాయమని రషెస్ చూసిన వారు ప్రశంసిస్తున్నారు.

సినిమాలోని ఇంటర్వెల్ మలుపు వెనుక కూడా జగపతి బాబు పాత్రే ప్రధాన కారణంగా ఉండబోతోందిట‌. హీరో జీవితానికి ఓ బలమైన లక్ష్యాన్ని ఏర్పరిచే ఎమోషనల్ సీన్ల ద్వారా ప్ర‌ధ‌మార్ధం ముగ‌స్తుంద‌ని అంటున్నారు. ఆ సమయంలో వచ్చే ఫైట్ సీక్వెన్స్‌కు దారితీసే పరిస్థితులు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. రామ్ చరణ్, జగపతి బాబు మధ్య వచ్చే తండ్రీకొడుకుల సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని లికులు అందుతున్నాయి. ఈ విష‌యంలో శిష్యుడు ఎంత హృద్యంగా వాటిని చిత్రీక‌రించాడ‌ని గురువు సుకుమార్ కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెన లో క్లైమాక్స్ తాను ఎంత మాత్రం ఊహించ‌లేద‌ని..ఆ క్లైమాక్స్ చూసే బుచ్చిబాబు గొప్ప ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని సుకుమార్ భావించిన‌ట్లు ఓపెన్ గానే చెప్పారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ లాంటి పెద్ద స్టార్ తో సినిమా తీసిన నేప‌థ్యంలో ఎమోష‌నల్ గా ఆ స‌న్నివేశాలు ఊహ‌కంద‌ని విధంగా ఉంటాయ‌ని అంతే న‌మ్మ‌కంతో సుకుమార్ ఉన్నారు. `పెద్ది` విజ‌యం సాధిస్తే ఇండ‌స్ట్రీలో బుచ్చిబాబు స్థానం మారిపోతుంది. టాప్ 5 డైరెక్ట‌ర్ల‌లో బుచ్చిబాబు చేరిపోతాడు. పాన్ ఇండియాలో ఈ సినిమా తెచ్చే గుర్తింపు అత‌డిని బాలీవుడ్ కు సైతం ప్ర‌మోట్ చేస్తుంది.