జగ్గూ భాయ్ చేసిన ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కామెంట్
ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా అలరించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 12 Sept 2025 9:00 PM ISTఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా అలరించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కెరీర్ స్టార్టింగ్ లో కంటే సెకండ్ ఇన్నింగ్స్ లోనే జగ్గూభాయ్ దూసుకెళ్తున్నారు. ఆయన్ని వరుస అవకాశాలు వెంటాడుతున్నాయి. తాజాగా మిరాయ్ సినిమాలో కీలక పాత్రలో నటించారు జగపతి బాబు.
కపిల్ శర్మ షోకు మిరాయ్ టీమ్
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ తో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మొత్తం ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో లో పాల్గొని సందడి చేసింది. ఆ షో లో అలనాటి హీరో, ఇప్పటి మోస్ట్ వాంటెడ్ టాలీవుడ్ యాక్టర్ జగపతి బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాలిటిక్స్ లో ప్రతినాయకులు ఎక్కువ
ఈ షోలో పుష్ప2 ప్రస్తావన వచ్చింది. ఆ మూవీలో జగపతి బాబు సెంట్రల్ మినిస్టర్ పాత్రలో కనిపించారని అందరికీ తెలుసు. పుష్ప2లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఆయన ఓ ఫన్నీ కామెంట్ చేశారు. తాను ఇప్పటివరకు విలన్ గా యాక్ట్ చేస్తూ వచ్చానని, ఒకవేళ పాలిటిక్స్ లోకి వస్తే మాత్రం తాను హీరోని అవుతానని, పాలిటిక్స్ లో ప్రతినాయకులు ఎక్కువ కాబట్టి అప్పుడు తానే హీరోని అవుతానని చెప్పి నవ్వులు కురిపించారు జగ్గూ భాయ్.
రాజకీయాల్లోకి రావడం ఇంపాజిబుల్
అయితే గతంలో జగపతి బాబు పరంపర అనే వెబ్ సిరీస్ ను చేయగా ఆ సిరీస్ మొత్తం పొలిటికల్ గానే కొనసాగింది. ఆ సిరీస్ పై డిస్కషన్ జరుగుతున్న టైమ్ లో మీరు పాలిటిక్స్ లోకి వస్తారా అని ఒకరు జగ్గూ భాయ్ ను అడగ్గా, సినిమా మాయ అయితే రాజకీయం మాయా లోకమని, ఆ మాయాలోకానికి తాను వెళ్లదలచుకోలేదని, నలుగురితో సరిగ్గా మాట్లాడటం కూడా తనకు రాదని, అలాంటి తాను పాలిటిక్స్ లోకి వెళ్లి లక్షల మందితో ఏం మాట్లాడతానని, తన లాంటోడు పాలిటిక్స్ కు పనికిరాడని, తాను పాలిటిక్స్ లోకి రావడం ఇంపాజిబుల్ అని చెప్పారు జగపతి బాబు.
