Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేములో అల‌నాటి ముగ్గురు స్టార్ హీరోయిన్లతో

సెల‌బ్రిటీ టాక్ షో గా ప్ర‌సార‌మ‌వుతున్న ఈ షోకు ఇప్ప‌టికే నాగార్జున‌, నాని, శ్రీలీల లాంటి గెస్టులు రాగా త‌ర్వాత రానున్న‌ సెల‌బ్రిటీలు మ‌రింత స్పెష‌ల్ గా మార‌డంతో పాటూ వార్త‌ల్లో నిలిచారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Sept 2025 3:00 AM IST
ఒకే ఫ్రేములో అల‌నాటి ముగ్గురు స్టార్ హీరోయిన్లతో
X

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా, ల‌వ‌ర్ బాయ్ గా ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న జ‌గ‌ప‌తి బాబు, ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్, ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ క్యారెక్ట‌ర్లలో న‌టిస్తూ త‌న ఇమేజ్ ను మ‌రింత పెంచుకున్నారు. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే జ‌గ‌ప‌తి బాబు రీసెంట్ గా హోస్ట్ గా మారారు. జీ తెలుగులో ప్ర‌సార‌మ‌వుతున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా అనే టాక్ షోతో ఆడియ‌న్స్ ను అల‌రిస్తున్నారు.

సెల‌బ్రిటీ టాక్ షో గా ప్ర‌సార‌మ‌వుతున్న ఈ షోకు ఇప్ప‌టికే నాగార్జున‌, నాని, శ్రీలీల లాంటి గెస్టులు రాగా త‌ర్వాత రానున్న‌ సెల‌బ్రిటీలు మ‌రింత స్పెష‌ల్ గా మార‌డంతో పాటూ వార్త‌ల్లో నిలిచారు. జ‌గ‌ప‌తి బాబు ఒక‌ప్పుడు హీరోగా న‌టించిన సినిమాల్లోని హీరోయిన్ల‌ను ఈ షో కు తీసుకొచ్చి ఓ ఎపిసోడ్ చేయ‌గా, రీసెంట్ గానే ఆ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ జ‌రిగింది.

అల‌నాటి భామ‌ల‌తో జ‌గ‌ప‌తి బాబు

ఆ హీరోయిన్లు మ‌రెవ‌రో కాదు, టాలీవుడ్ లోని ఒక‌ప్ప‌టి స్టార్ భామ‌లు మీనా, మ‌హేశ్వ‌రి, సిమ్ర‌న్. వీరంద‌రూ జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా టాక్ షో కు హాజ‌రవ‌గా, మ‌ధ్య‌లో బ్రేక్ టైమ్ లో అంద‌రూ క‌లిసి స‌ర‌దాగా త‌మ హీరో జ‌గ‌ప‌తి బాబు తో క‌లిసి ఓ ఫోటో దిగ‌గా, ఆ ఫోటోను మీనా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఒక‌ప్ప‌టి హీరోహీరోయిన్ల‌ను స‌డెన్ గా ఒకే ఫ్రేమ్ లో చూసి నెటిజ‌న్లు ఆనందంలో తేలుతూ ఆ ఫోటోను నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.

ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఇన్నేళ్లవుతున్నా, వ‌య‌సు మీద ప‌డుతున్నా ఆ సెల‌బ్రిటీల ఎన‌ర్జీ చూసి ఫ్యాన్స్ షాక‌వుతున్నారు. కాగా ఈ హీరోయిన్ల‌తో జ‌గ‌ప‌తి బాబు ప‌లు హిట్ సినిమాల్లో న‌టించారు. మీనాతో క‌లిసి చిల‌క‌ప‌చ్చ కాపురం, భ‌లే పెళ్లాం, జ‌గ‌న్నాట‌కం చేయ‌గా, మ‌హేశ్వ‌రితో క‌లిసి ప్రియ‌రాగాలు, జాబిల‌మ్మ పెళ్లి చేశారు. అల‌నాటి తారంతా క‌లిసి సింగిల్ ఫ్రేమ్ లో క‌నిపించ‌డంతో ఆనాటి గోల్డెన్ మూమెంట్స్ గుర్తుకు తెచ్చుకుని ఫ్యాన్స్ సంతోషిస్తుండ‌గా, ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్ర‌సార‌మ‌వుతుందో అనే ఆడియ‌న్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.