Begin typing your search above and press return to search.

పెద్ది: జగ్గూభాయ్ ని మాయం చేసిన అప్పలసూరి

అసలు జగపతిబాబు ఇలాంటి రఫ్ లుక్‌లో కనిపిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ రస్టిక్ అవతార్ గురించే చర్చ జరుగుతోంది.

By:  M Prashanth   |   12 Feb 2026 1:04 PM IST
పెద్ది: జగ్గూభాయ్ ని మాయం చేసిన అప్పలసూరి
X

టాలీవుడ్‌లో మేకోవర్ అంటే గుర్తొచ్చే పేర్లలో జగపతిబాబు ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టైలిష్ విలన్‌గా, రిచ్ ఫాదర్ రోల్స్‌తో మెప్పించిన జగ్గూభాయ్, ఇప్పుడు కంప్లీట్ రివర్స్ గేర్ వేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘పెద్ది’ మూవీలో ఆయన వేసిన గెటప్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. అసలు జగపతిబాబు ఇలాంటి రఫ్ లుక్‌లో కనిపిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ రస్టిక్ అవతార్ గురించే చర్చ జరుగుతోంది.

జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘అప్పలసూరి’ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. కళ్ళజోడు, మాసిన గడ్డం, చింపిరి జుట్టుతో ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తిలా కనిపిస్తున్న తీరు చూస్తుంటే బుచ్చిబాబు సానా ఏదో గట్టి ప్లాన్ లోనే ఉన్నట్లు అర్థమవుతోంది. ఒకప్పుడు స్టైలిష్ సూట్లు వేసుకుని కనిపించిన విలన్, ఇప్పుడు ఇలాంటి డీ గ్లామర్ రోల్ లో కనిపించడం పెద్ద సర్ప్రైజ్. అసలు జగ్గూభాయ్ ని మాయం చేసేలా అప్పలసూరి హైలెట్ అవుతాడని అర్ధమవుతుంది.

ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర పేరు అప్పలసూరి అని మేకర్స్ ఇదివరకే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబుతో సీరియస్‌గా డిస్కషన్ చేస్తున్న పోస్టర్ చూస్తుంటే, ఆ పాత్రలో చాలా డెప్త్ ఉండబోతోందని హింట్ దొరుకుతోంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో అప్పలసూరి పాత్ర సినిమాకే ఒక స్పెషల్ హైలైట్ కానుందట. రామ్ చరణ్ కూడా ఈ పాత్ర పట్ల ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు ఇప్పటికే హింట్ ఇచ్చారు.

సాధారణంగా పెద్ద సినిమాల్లో విలన్ లేదా సపోర్టింగ్ క్యారెక్టర్లు అంటే హడావుడి ఎక్కువ ఉంటుంది. కానీ ‘పెద్ది’ లో మాత్రం ప్రతి పాత్రను చాలా రియలిస్టిక్ గా చూపిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. జగపతిబాబు లాంటి లెజెండ్ తన ఇమేజ్ పక్కన పెట్టి ఇలాంటి క్యారెక్టర్లు చేయడం సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ఏప్రిల్ 30న విడుదల చేసేలా ప్లాన్ చేశాయి.

ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ రస్టిక్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. జగ్గూభాయ్ కళ్ళలో కనిపిస్తున్న ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే, ‘రంగస్థలం’ ప్రెసిడెంట్ గారిని మించిన ఇంపాక్ట్ ఈ అప్పలసూరి పాత్రతో ఉండబోతోందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. షూటింగ్ సెట్స్ నుండి వచ్చిన ఈ పిక్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రేంజ్ ఏంటో చెప్పకనే చెబుతోంది.

ఇక బుచ్చిబాబు సానా కాస్టింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని అర్ధమవుతుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్ లాంటి భారీ కాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో జగపతిబాబు రోల్ ఒక పవర్ఫుల్ ఉండబోతోందని అర్ధమవుతుంది. అప్పలసూరి పాత్ర థియేటర్లలో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే.