72 టేక్స్ నాన్సెస్.. సింగిల్ టేక్ యాక్టర్‌ని!
అయితే రీసెంట్ గా జగపతిబాబు ఓ సీన్ కోసం ఏకంగా 72 టేక్స్ తీసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానుల్లోనూ చర్చకు దారితీసింది.
By: Sravani Lakshmi Srungarapu | 2 Jun 2026 2:46 PM ISTటాలీవుడ్‌లో పాత్ర ఏదైనా దానికి ప్రాణం పోసే యాక్టర్ల లిస్ట్ లో సీనియర్ నటుడు జగపతిబాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. హీరోగా కెరీర్ ప్రారంభించి, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, ఎమోషనల్ క్యారెక్టర్లతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి తన టాలెంట్ ను చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ ప్రచారంపై స్పందించిన జగపతిబాబు, తనపై వస్తున్న అసత్య కథనాలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
అయితే రీసెంట్ గా జగపతిబాబు ఓ సీన్ కోసం ఏకంగా 72 టేక్స్ తీసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానుల్లోనూ చర్చకు దారితీసింది. అయితే ఈ విషయంపై స్పందించిన జగపతిబాబు, అలాంటి ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక నటుడి పనితీరును అర్థం చేసుకోకుండా ఇలాంటి పుకార్లు సృష్టించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా తాను రెండు టేక్స్‌లోనే సన్నివేశాన్ని పూర్తి చేస్తానని, అత్యవసర పరిస్థితుల్లో మూడో టేక్ మాత్రమే అవసరమవుతుందని వెల్లడించారు.
తనపై వచ్చిన పుకార్ల గురించి మాట్లాడుతూ, అదంతా నాన్సెన్స్ అని, పిచ్చి కుక్కలు ఏదోకటి వాగుతుంటాయి, మొరుగుతుంటాయి. అవన్నీ నిజాలెలా అవుతాయని ప్రశ్నించారు. 72 టేక్స్ తీసుకున్నాడని అనడంలో అసలు అర్థముందా అంటూ ఫైర్ అయ్యారు. మ్యాగ్జిమమ్ 3 టేక్స్ తీసుకుంటారు. నా సైడ్ నుంచి 2 టేక్స్ మాత్రమే తీసుకుంటానని చెప్తూ, యాక్టింగ్ లో ఎక్స్‌పీరియెన్స్, పాత్రపై అవగాహన, భావోద్వేగాలను కచ్చితంగా వ్యక్తీకరించే సామర్థ్యం ఉంటే అనవసరంగా ఎక్కువ టేక్స్ అవసరం ఉండదని జగపతిబాబు వ్యాఖ్యానించారు. పెద్ది సినిమా క్లైమాక్స్‌లో సుమారు నాలుగు నిమిషాల పాటు సాగే కీలకమైన సన్నివేశాన్ని ఒకే టేక్‌లో పూర్తి చేశానని చెప్పడం ద్వారా తన ప్రొఫెషనలిజాన్ని ఆయన మరోసారి నిరూపించారు. ముఖ్యంగా ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఉన్న సన్నివేశాల్లో కూడా తనకు పాత్రపై పూర్తి పట్టు ఉంటుందని ఆయన మాటల్లో స్పష్టమైంది.
జగపతిబాబు కెరీర్‌ను పరిశీలిస్తే, ప్రతి దశలోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న నటుడిగా కనిపిస్తారు. హీరోగా గుర్తింపు పొందిన తర్వాత వచ్చిన సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని, విలన్ పాత్రల్లో కొత్త ట్రెండ్ సృష్టించారు. లెజెండ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి సినిమాల్లో ఆయన చూపించిన యాక్టింగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు పెద్దిలో అప్పలసూరి పాత్ర ద్వారా మరో బలమైన పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
అప్పలసూరి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, తన కెరీర్లోనే ఆ పాత్ర ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని, గెటప్ పరంగా, ఎమోషన్స్ పరంగా, యాక్టింగ్ కు ఉన్న స్కోప్ పరంగా ఈ క్యారెక్టర్ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుందని అన్నారు. రామ్ చరణ్‌తో ఇప్పటికే రంగస్థలంలో గుర్తుండిపోయే పాత్రలో కనిపించిన జగపతిబాబు, పెద్దిలో మరోసారి చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. సినిమాలో తమ ఇద్దరి పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఆడియన్స్ ను కదిలిస్తుందని జగపతి ధీమా వ్యక్తం చేశారు.
