Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఏంద‌మ్మా జాకీ ఈ పులి వేషం?

By:  Sivaji Kontham   |   20 Aug 2025 9:00 AM IST
ఫోటో స్టోరి: ఏంద‌మ్మా జాకీ ఈ పులి వేషం?
X

అందాన్ని అందంగా ప్రెజెంట్ చేయడం ఒక క‌ళ‌. ఈ క‌ళ‌లో చాలా ఆరితేరిపోయింది జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఈ శ్రీ‌లంక‌న్ బ్యూటీ బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్, ముంబైలో ర్యాంప్ వాక్ లు, ఐపీఎల్ సీజ‌న్‌లో డ్యాన్సులు మెరుపులతో ప్ర‌తిసారీ త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ప్ర‌తిసారీ వేదిక ఏదైనా తానే కేంద్రక ఆక‌ర్ష‌ణ‌గా మారుతోంది. ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగా నిరంత‌రం యువ‌త‌రంలో స్ఫూర్తి నింపుతూనే ఉంది.

తాజాగా జాక్విలిన్ స్పెషల్ ఫ్రాక్ లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇది చూడ‌గానే ఏంట‌మ్మా ఈ పులి వేషం? అంటూ అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. జాకీ ఈసారి సేవ్ టైగ‌ర్స్ అని నిన‌దిస్తుందా? అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. అంద‌మైన టైట్ ఫిట్ ఫ్రాక్‌పై టైగ‌ర్ ఫోటోల‌ను ముద్రించిన ప్రింటెడ్ డిజైన‌ర్ డ్రెస్ నిజంగా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. బ్యాక్ లెస్, షోల్డ‌ర్ లెస్ లుక్స్ స‌హా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో జాకీ అదిరిపోయే ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారుతోంది.

నిజ‌మైన టైగ‌ర్ అయినా అలా జాక్విలిన్ ముందు న‌డుచుకుంటూ వెన‌క్కి తిరిగి చూడాల్సిందే! అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. జాక్విలిన్ కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే `వెల్ కం బ్యాక్ 3` మిన‌హా చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. జైలు నుంచే త‌న ప్రియుడు సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ చాలా ప్రాజెక్టులు ఆఫ‌ర్ చేస్తున్నాడు. కానీ వాటిని జాకీ తిర‌స్క‌రిస్తూ ప‌రువు కాపాడుకునే ప‌నిలో ప‌డింది. మ‌రోవైపు జాక్విలిన్ 120కోట్ల పైబ‌డిన నిక‌ర ఆస్తుల‌తో రిచెస్ట్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది.